Sankranti Special Trains: అంతటా సంక్రాంతి( Pongal ) సందడి ప్రారంభం అయింది. రైళ్లతో పాటు బస్సులు రద్దీగా మారాయి. నగరాల నుంచి గ్రామాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ తో పాటు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల ను నడుపుతోంది. అయినా సరే జనం రద్దీ తగ్గడం లేదు. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైళ్ల ముందస్తు బుకింగ్ జరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు అదనపు రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.
* ఆ మార్గాల్లో.. తెలంగాణ( Telangana) నుంచి సంక్రాంతికి ఏపీకి ఎక్కువ మంది వస్తుంటారు. పండగ పూర్తవగానే తిరిగి ప్రయాణం అవుతుంటారు. అందుకే తెలంగాణ రాష్ట్రాల నుంచి అనకాపల్లి మార్గంలో మరో మూడు అదనపు రైళ్లను నడపడానికి నిర్ణయించారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణం చేసే వారికి దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. రైలు నంబర్ 07471 అనకాపల్లి చర్లపల్లి మధ్య జనవరి 18న తిరగనుంది. రాత్రి 10:30 గంటలకు అనకాపల్లిలో బయలుదేరనుంది. ఆ మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు చర్లపల్లి కి చేరుకొనుంది.
* ట్రైన్ నెంబర్ 07472 చర్లపల్లి అనకాపల్లి మధ్య తిరగనుంది. 19వ తేదీ అర్ధరాత్రి 12:40 గంటలకు చర్లపల్లి లో బయలుదేరనుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లి చేరుతుంది. అదే రైలు 19న రాత్రి 10:30 కు అనకాపల్లిలో బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
* ఈ రెండు రైళ్లు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి.
* వీటిలో ఏసి, స్లీపర్, జనరల్ కోచ్ లు సైతం అందుబాటులో ఉంటాయి.