TTD: తిరుమల వెళ్లి భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని నిర్ణయించారు. పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండడంతో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష చేపట్టారు. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుంది.
* త్వరితగతిన ఏర్పాట్లు
అయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కేవలం 40 రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అడిషనల్ ఈవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పది రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను సైతం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నారు. ఏకాదశి పర్వదినాల నాడు చంటి బిడ్డలు, వృద్ధులు,దివ్యాంగులు,ఆర్మీ, ఎన్నారై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
* సాధారణ భక్తులకు ప్రాధాన్యం
సాధారణ భక్తులకు ఎక్కువగా స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు టీటీడీ అధికారులు. టికెట్లు కోటా తో పాటు ఇతర అంశాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష జరిపారు.వైకుంఠ ఏకాదశికి కావలసిన పూల అలంకరణలు,భక్తుల వసతి,శ్రీవారి సేవకులు,స్కౌట్లను నియమించడం,ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం,ఇతర అంశాలపై కూడా చర్చించారు. జనవరి 10న స్వర్ణ రథం, 11న చక్రస్నానం నిర్వహించేందుకు నిర్ణయించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: This is a suggestion for devotees going to tirumala crucial decision on darshans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com