YS Jagan : గుణపాఠాలు నేర్చుకోని జగన్.. ఇప్పటికీ ఆ నేతలేనా? సీనియర్ల ఆగ్రహం!

ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా ఉంటుంది పరిస్థితి. అధికారంలో ఉంటే మైనస్ లు కొట్టుకుపోతాయి. అధికారంలోకి వస్తే మాత్రం అవే హైలెట్ అవుతాయి. ఇప్పుడు వైసీపీలో ఎదురైన పరిస్థితి అదే.

Written By: Dharma, Updated On : August 8, 2024 11:40 am
Follow us on

YS Jagan : జగన్ గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ఓటమి గుణపాఠాలు నేర్పడం లేదు. ఇంకా అధికారపక్షం మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. అదే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వైసిపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంది. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను రీజియన్లుగా చేసుకొని ఇన్చార్జిలను నియమించారు జగన్. రాయలసీమను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కోస్తాంధ్రను సజ్జల రామకృష్ణారెడ్డికి, గోదావరి జిల్లాలను వై వి సుబ్బారెడ్డి కి, ఉత్తరాంధ్రను విజయసాయి రెడ్డికి అప్పగించారు. వాస్తవానికి ఈ నలుగురు అంత శక్తివంతులు కాదు. సీనియర్లు అంతకంటే కాదు. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖరరెడ్డికి సమకాలీకుడు. ఆయనకు బాధ్యతలు అప్పగించడంలో తప్పులేదు. కానీ విజయసాయిరెడ్డి జగన్ తో పాటు అక్రమాస్తుల కేసులు నిందితుడు. ఆయన ఒక సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే. సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు జర్నలిస్టు. వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగారు. వై వి సుబ్బారెడ్డి జగన్ కు అత్యంత దగ్గర బంధువు. స్వయానా బాబాయ్ కూడా. ఈ నలుగురికి రాష్ట్ర బాధ్యతలను అప్పగించి సీనియర్లను విస్మరించారు జగన్. అధికారంలో ఉన్నంతవరకు ఇది ఓకే కానీ.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వారికే బాధ్యతలు అప్పగించడం మాత్రం సాహసమే. ఓటమి అనే గుణపాఠం నుంచి ఇంకా తేలుకోకపోయినట్టే.ఇప్పుడు విశాఖలో స్థాయి సంఘ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది.దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అవుతోంది. అక్కడ కానీ ప్రతికూల ఫలితం ఎదురైతే.. జగన్ గుణపాఠం నేర్చుకోకున్నట్టే.

* సీనియర్లకు దక్కని గౌరవం
వైసీపీలో సీనియర్లు చాలామంది ఉన్నారు. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు సైతం జగన్ వెంట నడిచారు. జగన్ ను తమ నేతగా అంగీకరించారు. కానీ సీనియర్ల సేవలను మాత్రం జగన్ సరైన స్థితిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఆ నలుగురినే నమ్ముకున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఆ నలుగురు చేతిలో పెట్టారు. దానికి ఈ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. అయినా సరే దానిని ఒక గుణపాఠంగా భావించడం లేదు.

* వరుస ఓటములు
ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి సమన్వయ బాధ్యతలు తీసుకున్నాక వరుస ఓటములు ఎదురయ్యాయి. 2022 సెప్టెంబర్ లో ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. ఎన్నికలకు ముందు చాలామంది నేతలు పార్టీని వీడారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిని ఇతర పార్టీలో చేరకుండా నియంత్రించడంలో వైవి సుబ్బారెడ్డి విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అయినా సరే ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి వైవిని తప్పించలేదు.

* వారిని బలంగా రుద్దడం బాధాకరం
ఎక్కడో రాయలసీమకు చెందిన నేతలను తీసుకొచ్చి.. తమపై రుద్దడం ఏంటని వైసీపీ సీనియర్లలో ఒక రకమైన బాధ కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు ఇంతకుముందు విజయసాయిరెడ్డి ఇన్చార్జిగా ఉండేవారు. ఆయనను తప్పించి వైవికి బాధ్యతలు అప్పగించేలా.. వైసీపీలో కొన్ని రకాల అగాధాలు సృష్టించినట్లు తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డి పై స్థానిక నేతలతో ఫిర్యాదులు ఇప్పించింది కూడా వైసీపీ పెద్ద నేతలేనని తెలుస్తోంది. మరోవైపు తాము రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులం అయితే.. జగన్ తమను లెక్కచేయకుండా రాయలసీమ నేతలను తమపై రుద్దడం పై.. చాలామంది సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. అయితే అధికారంలో ఉన్న రోజులు నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో గళం ఎత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.