TDP Janasena Alliance: చంద్రబాబు, పవన్ భేటీతో ఏపీ రాజకీయం హీటెక్కింది. చంద్రబాబుకు సంఘీభావంగా పవన్ వెళ్తే.. పొత్తు కోసమంటూ వైసీపీ నానా యాగీ చేస్తోంది. ఇంకో అడుగు ముందుకేసింది. టీడీపీని జనసేన అడిగిన సీట్లు ఇవేనంటూ ప్రచారం చేస్తోంది. దీనిపై జనసైనికులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చంద్రబాబు, పవన్ భేటీలో వైసీపీ నేతలు ఏమైనా కూర్చున్నారా ? లేక పవన్ వైసీపీ నేతల చెవిలో ఏమైనా చెప్పారా ? అంటూ జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.

జనసేన, టీడీపీ అధినేతల కలయికను వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. పవన్, చంద్రబాబు భేటీ పై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇరుపార్టీల కలయిక ఏదో నేరమన్నట్టు ప్రశ్నిస్తున్నారు. 175 సీట్లు గెలిచే పార్టీకి ఇంత భయమెందుకని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ.. జనసేన, టీడీపీ పొత్తులో పంచుకునే సీట్ల పై కూడ ప్రకటన చేసింది. జనసేన టీడీపీని అడగబోయే సీట్లు ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది.
వైసీపీ చెబుతున్న సీట్లు ఇవే
1.విశాఖ నార్త్
2. చోడవరం
3. గాజువాక
4. భీమిలి
5. యలమంచిలి
6.రాజానగరం
7. అమలాపురం
8.రాజోలు
9. కాకినాడ రూరల్
10. భీమవరం
11. నరసాపురం
12. తాడేపల్లి గూడెం
13. కైకలూరు
14. విజయవాడ పశ్చిమ
15. తెనాలి
16. సత్తెనపల్లి
17. గుంటూరు పశ్చిమ
18. దర్శి
19. గిద్దలూరు
20. చీరాల
21. చిత్తూరు
22. తిరుపతి

వైసీపీ ప్రచారం పై జనసైనికులు సెటైరికల్ గా స్పందించారు. ఏకాంతంగా జరిగిన చంద్రబాబు, పవన్ భేటీలో వైసీపీ నేతలు ఏమైనా కూర్చున్నారా ? లేక పవన్ వైసీపీ నేతల చెవిలో ఏమైనా చెప్పారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ గెలిచే సీట్ల గురించి ఆలోచించకుండా, జనసేన పోటీ చేసే సీట్ల గురించి ఆలోచించడం ఏంటని అడుగుతున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఓటమి ఖాయమన్న దిగులు మొదలైందని జనసైనికులు అంటున్నారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ 175 సీట్లు గెలుస్తామని ప్రకటిస్తారు. అంత విశ్వాసం ఉన్నప్పుడు జనసేన, టీడీపీ పొత్తు పై పడి ఏడ్వడం ఎందుకనేది జనసైనికుల వాదన.