Shanmukh- Deepthi: క్రేజీ లవ్ బర్డ్స్ దీప్తి సునైన-షణ్ముఖ్ విడిపోయిన విషయం తెలిసిందే. 2021లో ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. దీప్తి సునైన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. షణ్ముఖ్ తో బంధం తెంచుకుంటున్నట్లు అభిమానులతో వెల్లడించారు. వీరి మధ్య మనస్పర్థలకు సిరి హన్మంత్ కారణమన్న మాట వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్, సిరి పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ పేరుతో రొమాన్స్ చేశారు. హౌస్లో వీరి కెమిస్ట్రీ హద్దులు దాటింది. సిరికి దగ్గరైన షణ్ముఖ్ లవర్ దీప్తి కోపానికి కారణమయ్యాడని ప్రచారమైంది.

ఏడాది కాలంగా దీప్తి-షణ్ముఖ్ విడివిడిగా ఉంటున్నారు. ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉంటున్నారు.అయితే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని సమాచారం. సోషల్ మీడియా కామెంట్స్, పోస్ట్స్ తో ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే సడన్ గా వీరు కలిసిపోయినట్లు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. వైజాగ్ వెళ్లడం జరిగింది. సదరు ఈవెంట్లో షణ్ముఖ్ దీప్తిపై ప్రశంసలు కురిపించాడు. దీప్తి అరుదైన అమ్మాయి. చాలా మందికి స్ఫూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
కాగా జనవరి 10న దీప్తి సునైన బర్త్ డే. సోషల్ మీడియాలో పబ్లిక్ గా దీప్తికి బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే పూర్తి పేరు ప్రస్తావించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో దీప్తి-షణ్ముఖ్ కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది.కాగా విడిగా ఉండటం వలన వీరు ఆదాయం కెరీర్ కోల్పోతున్నారు. దీప్తి, షణ్ముఖ్ బెస్ట్ డాన్సర్స్, యాక్టర్స్. ఈ జోడీకి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, డాన్స్ వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి.

విడిపోవడం వలన పెద్ద మొత్తంలో వారు ఆదాయం కోల్పోయారు. రియలైజ్ అయిన వీరు కలిసి ఉంటే కలదు సుఖం అన్న అభిప్రాయానికి వచ్చారన్న మాట వినిపిస్తోంది. వారి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. చాలా కాలంగా దీప్తి-షణ్ముఖ్ ప్రేమించుకుంటున్నారు. దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2 లో దీప్తి సునైన పాల్గొన్నారు. ఆమె 10 వారాలు హౌస్లో ఉన్నారు. షణ్ముఖ్ బర్త్ డే విషెస్ కి దీప్తి రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరూ కలిసి పోయినట్లే లెక్క.