Media Head: ఇప్పుడు ఆ మీడియా అధినేత విషయంలో కూడా పై ఉపోద్ఘాతమే జరుగుతోంది. ఆయన భార్య కొంతకాలం క్రితం గతించింది. సహజంగానే ఆయన విలాస పురుషుడు. చిలిపి చేష్టలకు.. కొంటె పనులు చేసే చెలికాడు. గురిగింజ తన నలుపు ఎరగదు అన్నట్టుగా.. అతడు మాత్రం తన చేతిలో మీడియా ఉందనే కండకావరంతో ఇష్టానుసారంగా విమర్శలు చేసేవాడు. అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేసేవాడు.. దీంతో చాలామంది అతడి చేతిలో బాధితులుగా మారిపోయారు. అయితే అలాంటి వ్యక్తి ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. వాస్తవానికి సదరు మీడియా అధిపతి తన భార్యకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించేవాడు. అక్కడ పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త వేరే బంధానికి దారితీసింది. ఈ లోగానే ఇతడి భార్య చనిపోయింది.. ఇక తర్వాత మనోడి వ్యవహారానికి అడ్డంటూ లేకపోయింది. అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు వారించారు. రెండో పెళ్లికి అడ్డు చెప్పారు.. ఎటువంటి మయోపాయం ఉపయోగించాడో.. ఎలాంటి ప్రణాళికలు రచించాడో తెలియదు గాని.. మొత్తానికి తన రెండవ పెళ్లికి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకున్నాడు. ప్రస్తుతం శంషాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో (ఓ బిల్డర్ మీద వ్యతిరేక వార్తలు రాస్తే.. గిఫ్ట్ గా ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి) సంసార జీవితాన్ని సాగిస్తున్నాడు.
అత్తింటి వారు సంక్రాంతికి పిలిచారా?
ఇతరుల జీవితాలపై అడ్డగోలుగా కథనాలు రాసే ఆ మీడియా అధిపతి.. ఇప్పుడు మీడియా సర్కిల్లో ప్రధాన వార్తగా మారిపోయాడు. రెండో పెళ్లి చేసుకున్న నాటి నుంచి బయటికి కనిపించడం మానేశాడు. ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు.. చివరికి తన కార్యాలయాలకు కూడా రావడం లేదు.. ఇదేదో మేం చేస్తున్న ఆరోపణ కాదు. విమర్శ అంతకన్నా కాదు..” మొత్తానికి ముసలోడికి దసరా పండుగ లాగా.. ఈ వయసులో వీడికి పెళ్లయింది.. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారి జీవితాలపై గతంలో వీడు ఎలా పడ్డాడో అందరికీ తెలుసు. ఎలాంటి దిక్కుమాలి రాతలు రాశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని వీడే ఇప్పుడు ఆ కోవలోకి వస్తాడని అసలు ఊహించలేదు. దీనినే కర్మ ఫలితం అంటారు. ఎవడు ఏం చేసుకుంటే తిరిగి అదే వస్తుంది.. పాపం ఈ విషయాన్ని వాడు మర్చిపోయినట్టున్నాడు. అందు గురించే ఇప్పుడు కాలు కాలిన పిల్లి లాగా ముడుచుకుపోతున్నాడు. సమాజానికి నీతులు చెబుతూ.. వీడు మాత్రం… గుడిసెలు తొక్కుతున్నాడు.. ఇటువంటివారు మీడియా అధిపతులుగా చలామణి కావడం ఈ సమాజం చేసుకున్న పాపం. అన్నట్టు రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అత్తింటి వారు సంక్రాంతికి పిలిచారా.. ఎందుకంటే వీడు పెళ్లి చేసుకున్న డాక్టర్ ఆంధ్రా ఆడపడుచు కదా.. పెళ్లయిన తొలి ఏడాదిలో కొత్త దంపతులకు ఆంధ్ర ప్రాంతం వారు సారెలు పెడతారు కదా.. వీడికి కూడా పెట్టారేమో”అని మీడియా సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.. ఒకటి మాత్రం నిజం.. చేతిలో మీడియా ఉంది కదా అని అడ్డం గా రాస్తే.. అడ్డదిడ్డంగా కథనాలను ప్రసారం చేస్తే.. అంతిమంగా ఏదో ఒక రోజు అవే అడ్డం తిరుగుతాయి.. అందుకు ఈ మీడియా అధినేత జీవితమే ఒక ఉదాహరణ.. యద్భావం తద్భవతి.