Print Media : సమాజంలో ఉన్న అవినీతిని.. ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలను.. అధికారులు చేసే వసూళ్లను ఎప్పటికప్పుడు మీడియా ఎండగడుతూ ఉంటుంది. యానివర్సరీ, ఎన్నికలు, సంవత్సర చందాలు రాగానే ఒక్కసారిగా మీడియా తన రూటు మార్చుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రింట్ మీడియా మరీ దారుణం. ఆ భాగాలలో పనిచేసే విలేకరులు పీడించుకు తింటారు. పేపర్లు కట్టించాలని.. యానివర్సరీ యాడ్స్ ఇవ్వాలని ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలుపెడితే కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల వరకు వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మేనేజ్మెంట్ వీరికి టార్గెట్లు పడుతుంది కాబట్టి.. పాత్రికేయం ముసుగులో జనాల మీద పడుతుంటారు. తప్పనిసరి తద్దినం లాగా అటు అధికారులు.. ఇటు ప్రజా ప్రతినిధులు ఎంతో కొంత మోహానపడేస్తుంటారు. బ్రాంచ్ మేనేజర్లు.. బ్యూరో చీఫ్ లు.. ఎడిషన్ ఇన్చార్జ్ లు రిపోర్టర్ల కు నిత్య ఫోన్లు చేస్తూ.. టార్గెట్ రీచ్ అయ్యేవిధంగా చేస్తుంటారు. వాస్తవానికి ఇలాంటి వ్యవహారాన్ని పాత్రికేయం అనకూడదు.. పాత్రికేయం ముసుగులో చేస్తున్న దందా అనాలి. తెలుగు నాట పైతరహా దందాకు ఒకటి మినహా మిగతా అన్ని పత్రికలు అలవాటు పడ్డాయి. ప్రతి ఏడాది ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నాయి.
Also Read : మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపిస్తానందీ.. లోకేష్ సంచలన కామెంట్స్
ఇక ఇటీవల ఓ పత్రిక యజమాని జిల్లాలలో పర్యటనలు జరిపారు. తన పత్రికను సముచిత స్థానంలో నిలబెట్టాలని అనుకున్నారు. అన్ని జిల్లాల బ్రాంచ్ మేనేజర్లకు, బ్యూరో చీఫ్ లకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఒక జిల్లాలో మీటింగ్ జరుపుతుండగా.. ఆ పత్రిక యజమానికి.. అక్కడి బ్యూరో చీఫ్ వ్యవహార శైలి నచ్చలేదు. వెంటనే అందరి ముందు..” నీ చేతకానితనం వల్లే ఇదంతా.. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఒక వార్త కూడా ఎందుకు రాయడం లేదు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వెళ్లడం లేదు” అంటూ ఆ పత్రిక అధిపతి చిందులు తొక్కారు. ఆ బ్యూరో చీఫ్ కు ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. తనకు స్థాన చలనం కలిగిస్తారనే భయంతో ఆ బ్యూరో చీఫ్ వెంటనే తను మడుగులొత్తే మంత్రి గారి దగ్గరికి వెళ్లిపోయాడు. విషయం మొత్తం చెప్పాడు. దీంతో ఆ మంత్రి గారు వెంటనే ఆ పత్రిక అధిపతికి ఫోన్ చేశారు.” మనవాడే కదా. యాడ్స్ కూడా చేస్తున్నాడు కదా. నీకు కావాల్సిన డబ్బులు వస్తున్న తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంటి.. ఈ రోజుల్లో నెగిటివ్ వార్తలు రాస్తే బ్యూరో చీఫ్ లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నీకు తెలియదా.. అతడిని ఏమీ అనకు. అతడు నాకు కావలసిన వ్యక్తి” అంటూ ఆ మంత్రిగారు ఫోన్ ముగించారు. దీంతో అప్పటిదాకా చిందులు తొక్కిన పత్రిక అధిపతి సైలెంట్ అయిపోయారు. బ్యూరో చీఫ్ బతుకు జీవుడా అనుకుంటూ బయటికి వచ్చాడు. ఇలాంటి వ్యక్తులు మన వ్యవస్థను శాసిస్తున్నారు. మనం చదివే వార్తలను.. మనం నడుచుకునే శాసనాలను.. రూపొందిస్తున్నారు. ఒకరేమో నాలుగో వ్యవస్థకు.. ఇంకొకరేమో శాసన వ్యవస్థకు అధిపతులుగా ఉన్నారు.
వాస్తవానికి యాడ్స్ టార్గెట్ పెట్టి.. సర్కులేషన్ టార్గెట్ పెట్టి.. పండగలకు, ఇతర వ్యవహారాలకు లక్ష్యాలు విధించి.. బ్యూరో చీఫ్ లకు నరకం చూపిస్తున్న యాజమాన్యం.. నెగిటివ్ వార్తలు రాయాలి అని ఆదేశాలు జారీ చేయడం అత్యంత దారుణం. ఒకవేళ నెగిటివ్ వార్తలు రావాలి అనుకుంటే.. ఇవన్నీ కూడా ఆయా విభాగాలతో పూర్తి చేయించాలి. ఆ విభాగాలను పక్కనపెట్టి.. కేవలం బ్యూరో చీఫ్ లకు టార్గెట్ లు విధిస్తూ.. నెగిటివ్ వార్తలు రాయాలి అని ఆదేశాలిస్తూ.. ఇబ్బందులు పెట్టడం మాత్రం నిజంగా దారుణం. వాస్తవానికి ఆ పత్రికాధిపతికి పాత్రికేయంతో సంబంధం ఉంది. గతంలో ఆయన పాత్రికేయుడుగా కూడా పనిచేశారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందులకు బ్యూరో చీఫ్ లను గురిచేయడం.. ఆయనకే చెల్లింది.