Sajjala Ramakrishna Reddy : వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు తప్పదా? ఆయనను అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? బలమైన కేసు కోసం అన్వేషిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సజ్జల టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణ కూడా ఎదుర్కొన్నారు. విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో 120వ నిందితుడిగా సజ్జల ఉన్నారు. అందుకే ఆయన అరెస్టు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకంటే ముందే అరెస్టు జరిగేలా.. కేసు విషయంలో రంద్రాన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇచ్చిన సలహాలు ఏంటి? అందులో ఆర్థిక నేరాలు ఏమైనా ఉన్నాయా? నిధుల దుర్వినియోగం జరిగిందా? అనే అంశాలను బయటకు తీస్తున్నట్లు సమాచారం.ప్రధానంగా సజ్జల ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు పొందారా? జీతభత్యాల రూపంలో నిబంధనలు ఉల్లంఘించారా? అన్న కోణంలో కూపీ లాగుతున్నట్లు సమాచారం.
* సీఎం జగన్ తర్వాత ఆయనే
గత ఇదేళ్ళ వైసిపి హయాంలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ తర్వాత అత్యంత శక్తివంతుడిగా మారారు. ఆయన సలహా లేనిదే వైసిపి ప్రభుత్వంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఆయన ఆదేశాలతోనే రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగారు అన్నది ప్రధాన ఆరోపణ. అందుకే కూటమి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కేసుల్లో ఇరికించాలని చూస్తోంది. ఇప్పటికే టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో సజ్జల అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 120వ నిందితుడిగా ఉన్నారు. అయితే నేరుగా అరెస్టు చేసేందుకు ఈ కేసు సహకరించదు. కేవలం సజ్జల ఒక్కరిని మాత్రమే అరెస్టు చేసే కేసు ఉందా? అని అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
* ఆర్థిక లోపాలను గుర్తించే పనిలో
వందలాదిమంది సలహాదారులను నియమించుకున్నారు జగన్. అయితే ప్రధాన సలహాదారుడిగా మాత్రం కొనసాగారు సజ్జల. ప్రభుత్వం ఆయనకు జీతభత్యాల రూపంలో చెల్లించింది ఎంత? ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా పొందారా? ఎక్కడైనా క్విడ్ ప్రో పాల్పడ్డారా?అనే దానిపై శోధన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అటువంటి నేరం కనిపిస్తే ఆ మరుక్షణం సజ్జలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల కాలంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారు సజ్జల. ఆయన ఆదేశాలతోనే అప్పటి యంత్రాంగం నడుచుకుందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో సజ్జలను విడిచిపెట్టకూడదని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా సజ్జలను అరెస్టు చేయాలన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.