TTD Parakamani: తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో లడ్డు వివాదంతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఏదో ఒక వివాదం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా టీటీడీ పరకామణిలో చోరీ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ చోరీ వెనుక ఉన్న దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనకాల ఉంది మీరంటే మీరు అంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ వివాదం టిడిపి కూటమి వెర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మారింది. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమనా కరుణాకర్ రెడ్డి టార్గెట్ కావడం విశేషం. ఆయనపై బిజెపి నేత భాను ప్రకాష్.. జనసేన నేత కిరణ్ రాయల్ గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు.
* విదేశీ కరెన్సీ పక్కదారి..
తిరుమలలో పరకామణి ( parakka Mani )ఉంటుంది. శ్రీవారికి హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్కడ లెక్కిస్తుంటారు. ఈ క్రమంలో రవికుమార్ అనే వ్యక్తి ఓ మతం తరుపున పని చేసేవాడు. యాళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ.. విదేశీ కరెన్సీ ని లెక్కించేవాడు. అయితే చాలా కాలంగా విదేశీ కరెన్సీ ని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీ ని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబుల్లో దాచుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేశారు. ఆరోజు 900 డాలర్లు అపహరించగా.. అప్పట్లో వాటి విలువ రూ.72,000 గా తేల్చారు టీటీడీ అధికారులు. రవికుమార్ చాలాకాలంగా పరకామణిలో డబ్బులు గుట్టుగా దాచి.. కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పట్లో ఆయన పట్టు పడడంతో కోట్ల విలువైన ఆయన ఆస్తులను టీటీడీకి విరాళంగా రాయించారు. లోక్ అదాలత్ లో కేసు రాజీ చేయించి మిగతా ఆస్తులను కొంతమంది నేతలు కొట్టేశారన్న ఆరోపణలు తాజాగా వినిపిస్తున్నాయి. పోలీసుల ఒత్తిడితోనే కేసు రాజు చేయించారని అప్పటి సహాయ విజిలెన్స్, భద్రత అధికారి రాజా గారు చెప్పడం కళకళ రేపింది. అయితే తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల కుంభకోణంలో తెరవెనుక ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు సిఐడి రంగంలోకి దిగనుంది.
* కోర్టు ఆదేశాలతో సిఐడి..
ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా భాను ప్రకాశ్ రెడ్డి( Bhanu Prakash Reddy) ఉన్నారు. అప్పట్లో లోక్ అదాలత్ తీర్పు పై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారం సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను షీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది. అయితే పరకామణి లో రవికుమార్ 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడని.. అప్పుడు ఎందుకు ఆయనను పట్టుకోలేదని ప్రశ్నించారు. సిఐడితో కాదు సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో రెండు రోజుల్లో సంచలన అంశం వెలుగులోకి వస్తుందని బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఇది 300 కోట్ల రూపాయల కుంభకోణంగా జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. రవికుమార్ నుంచి వైసీపీ పెద్ద తలకాయలతో పాటు అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని ఆరోపించారు.
* ఆందోళనలో భక్తులు..
టీటీడీ( TTD) కేంద్రంగా వెలుగు చూస్తున్న ఈ వివాదాలు రాజకీయ రచ్చకు కారణం అవుతున్నాయి. మరోవైపు కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కూటమి ప్రభుత్వం, వైసిపి ఆరోపణల మధ్య..శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకలు పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.