Nellore District : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా చదువుకున్న వారు,విద్యాధికులు,ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీల నేతలు సైతం వివాహేతర సంబంధాలు కొనసాగించడం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆరుపదులకు దగ్గరగా ఉన్న నేత నిర్వాకం ఇటీవల పెను దుమారానికి దారి తీసిన సంగతి విధితమే.అయితే తాజాగా ఓ ఎంపీడీవో ఏకంగా ఏఎన్ఎంతో దుకాణం పెట్టేసాడు. ఏకంగా లాడ్జికి తీసుకెళ్లి రాసలీలలు నడుపుతున్నాడు. అనుమానం వచ్చి నిగా పెట్టిన కుటుంబ సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు. అసలు విషయం బయటపడింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకు చిత్తూరు జిల్లాకు బదిలీ అయింది. బదిలీ అయినచోట ఏఎన్ఎం పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వారి మధ్య వ్యవహారం నడుస్తోంది. ఈ తరుణంలో భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశారు సదరు ఎంపీడీవో. ఆయన ప్రవర్తన తీరుపై అనుమానం రావడంతో భార్య, పిల్లలు నిఘా వేశారు. ప్రియురాలితో లాడ్జిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్నారు పోలీసులు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
* ఇదేనా ఆదర్శం?
అధికారులంటే ఆదర్శంగా ఉండాలి. ప్రజా ప్రతినిధులు అంటే పారదర్శకంగా వ్యవహరించాలి. కానీ ఇలా కుటుంబ వ్యవహారాలు బయటకు తెచ్చి మరి అభాసుపాలవుతున్నారు కొందరు. ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల రాసలీలలే బయటపడ్డాయి. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీడీవో అది కూడా.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో దొరికిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఎస్సై ఎంపీడీవో తో పాటు సదరు ఏఎన్ఎం కు కౌన్సిలింగ్ చేశారు. కలిసి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. లేకుంటే కోర్టుకు వెళ్లాలని కూడా అన్నారు. అయితే కూర్చొని మాట్లాడుకోవడానికి చివరికి వారంతా మొగ్గు చూపారు.
* కఠిన చర్యలు
అయితే ఎంపీడీవో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం ఈ వార్త వైరల్ అయింది. పోలీస్ శాఖ పరంగా ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని సూచించినా.. ప్రభుత్వం మాత్రం సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశం ఉంది. ఎంపీడీవో వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది.