https://oktelugu.com/

Tik Tok Srinu: టిక్ టాక్ శ్రీను విషాదాంతం.. అసలేం జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన ఎడ్లపల్లి శ్రీనివాస్ సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ మంచి పేరు సంపాదించాడు. ఎనిమిది సంవత్సరాల కిందట ఇద్దరు పిల్లలు రోజు వ్యవధిలో పాముకాటుకు గురై మృతి చెందారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 4, 2024 / 01:57 PM IST

    Tik Tok Srinu

    Follow us on

    Tik Tok Srinu: టిక్ టాక్ శ్రీను.. అలియాస్ యడ్లపల్లి శ్రీనివాస్. ఓ ఫ్యాక్టరీలో రోజువారి కార్మికుడు. అయినా సరే టిక్ టాక్ లో అందరికీ సుపరిచితుడు అయ్యాడు. బహుళ ప్రాచుర్యం పొందాడు. ఇద్దరు పిల్లలు, భార్య, తల్లిదండ్రులతో సాఫీగా జీవితం సాగిపోతోంది.అయితే ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది ఏమో.. ఒక్కొక్కర్నీ మృత్యువు కబళించింది. చివరకు ఆ మనస్థాపంతో శ్రీను సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన విషాదంతో తల్లి, కుమార్తె అనాథలుగా మిగిలారు.

    పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన ఎడ్లపల్లి శ్రీనివాస్ సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ మంచి పేరు సంపాదించాడు. ఎనిమిది సంవత్సరాల కిందట ఇద్దరు పిల్లలు రోజు వ్యవధిలో పాముకాటుకు గురై మృతి చెందారు. తరువాత శ్రీనివాస్ దంపతులు ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఇంతలో ఏడాది కిందట శ్రీను భార్య, తండ్రి సైతం చనిపోయారు. అప్పటినుంచి శ్రీను మానసికంగా కృంగిపోయాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో గడుపుతున్నాడు.

    కొవ్వూరు బ్రిడ్జి వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు పక్కన బైక్ ఆపి.. నదిలో గెంతేశాడు. పక్కన ఇసుక ర్యాంపు కార్మికులు కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే శ్రీను మృతి చెందాడు. ప్రస్తుతం దత్తత బాలిక, శ్రీను తల్లి మాత్రమే మిగిలారు. ఆ కుటుంబ పరిస్థితిని చూసి స్థానికులు చలించి పోతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు.