Rashmika
Rashmika : నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వరుసగా పెద్ద సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. సీనియర్ ముద్దుగుమ్మలు మాత్రమే కాదు యంగ్ హీరోయిన్లు కూడా బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్నారు. కాగా రష్మిక వాళ్లందరిలో ఒక అడుగు ముందే ఉంది. దీపికా పదుకొణె ప్రస్తుతం బాక్సాఫీస్ క్వీన్ గా ఏలుతోంది. అందుకు కారణం ఆమె ఖాతాలో ఒకటి రెండు కాదు ఏకంగా 1000 కోట్లు రాబట్టిన మూడు సినిమాలు రష్మిక ఖాతాలో ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఈ బాక్సాఫీస్ క్వీన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రష్మిక ఖాతాలో ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.
రష్మిక నటించిన గత మూడు సినిమాల కలెక్షన్లు రూ. 3 వేల కోట్ల మార్కును దాటేశాయి. హీరో ప్రభాస్ గత మూడు సినిమాలతో రూ.2 వేల కోట్లకు పైగా రాబడితే, రష్మిక ఏకంగా రూ.1000 కోట్లు ఎక్కువే రాబట్టింది.. ఈ లెక్క ఇంకో రూ.500 కోట్లు పెరిగేలా ఉంది. 2023 డిసెంబర్‌లో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో నటించింది రష్మిక. రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ ‘A’ సర్టిఫైడ్ మూవీ, బాక్సాఫీస్ దగ్గర రూ.920 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల వరుస ప్లాపుల్లో ఉన్న రణబీర్ కపూర్ కి బిగ్గెస్ట్ హిట్ దక్కింది.
2024 డిసెంబర్‌లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీలో నటించింది రష్మిక. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి, అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో రూ.800 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచి, ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసింది. ‘పుష్ప 2: ది రూల్’ .. 2024 డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ‘ఛావా’ మూవీ. ‘పుష్ప 2’ మూవీ కారణంగా రెండు నెలలు వాయిదా పడింది. 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చిన ‘ఛావా’ భారీ ఓపెనింగ్స్ సాధించింది. బ్లాక్ బస్టర్ రివ్యూస్ రావడంతో ఈజీగా రూ.500-600 కోట్ల వరకూ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
విక్కీ కౌషల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘ఛావా’.. అటు రణ్‌బీర్ కపూర్, ఇటు అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లు అందించింది రష్మిక. ఇప్పుడు విక్కీ కౌషల్‌కి కూడా బిగ్గెస్ట్ సూపర్ హిట్ అందించింది. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది ఛావా మూవీ. పుష్ప 2 తర్వాత మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది.
రష్మిక ఉన్న గత మూడు సినిమాలు ఇప్పటికే రూ.3 వేల కోట్ల మార్కును దాటేశాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న ‘సికందర్’ సినిమా పైన పడింది. ఏ.ఆర్. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 మార్చి 28న విడుదల అవుతోంది. ప్రస్తుతం సల్మాన్ కూడా వరుస ప్లాపుల్లో ఉన్నారు. మరి ఈ సినిమాతో రష్మిక తనకు కూడా రూ.1000కోట్ల సినిమా ఇస్తుందేమో చూడాలి.