YS Jagan : ఏదైనా రాజకీయ పార్టీ సక్సెస్ వెనుక అనుబంధ విభాగాల పాత్ర ఉంటుంది. వారు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడితే పార్టీ ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. అయితే గత కొన్నేళ్లుగా పార్టీ అనుబంధ విభాగాల పాత్ర తగ్గింది, వాటి స్థానంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. పార్టీ వాయిస్ ను క్షణాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తోంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వందల కోట్ల రూపాయలతో సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటుచేసుకుంటాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా వికృత పోకడలకు దిగుతోంది.
రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని తగ్గించే క్రమంలో సోషల్ మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. ఇటీవల ఏపీ సీఎం జగన్ కు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. సీఎం వేసుకునే చెప్పుల ధర ఎంతో తెలుసా? అది ఏ బ్రాండ్? ఎక్కడ నుంచి తప్పించారు? అన్న విషయాలను అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. అవి ఇటాలియన్ బ్రాండ్ గా చెప్పుకొస్తున్నారు. జగన్ వాడుతున్న చెప్పుల ధర రూ.6,153 అని..ఇండియన్ కరెన్సీలో అయితే రూ.లక్ష పైనే అని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ పోస్టింగులు పెడుతున్నారు. అయితే దీని వెనుక ఉంది మాత్రం టీడీపీ సోషల్ మీడియా విభాగమే.
అయితే ఈ తరహా సోషల్ మీడియా పోస్టింగులు ఇప్పుడే కాదు. గతంలో కూడా వెలుగుచూశాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో సైతం వైసీపీ సోషల్ మీడియా ఇదే తరహా ప్రచారం చేసింది. సీఎంగా ఉన్న చంద్రబాబు, మంత్రిగా ఉన్న లోకేష్ హిమాలయన్ వాటర్ ను తాగేవారని.. వాటి ఖరీదు వేలల్లో ఉంటుందని అప్పట్లో ప్రచారం చేశారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు చెప్పే క్రమంలో ఈ తరహా ప్రచారం చేసేవారు. అప్పట్లో అది బాగానే వర్కవుట్ అయ్యింది. దీంతో టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు జగన్ చెప్పులపై ప్రచారం మొదలుపెట్టింది.
అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్డవుతున్నారు. రివర్స్ కౌంటర్లకు దిగుతున్నారు. విమర్శలు రాజకీయంగా ఉండాలి తప్ప… ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం వేసుకుంటున్నారు అంటూ వ్యక్తిగత విషయాలపై ఉండకూడదని చెబుతున్నారు. జగన్ ఈ చెప్పులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని ఏమీ వినియోగించలేదు కదా అని మరికొందరు నెటిజన్లు కౌంటర్స్ వేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో వందల కోట్లు తన ఆస్తులని ప్రకటించుకున్న వ్యక్తికి.. ఇది పెద్ద విషయం కాదనే ఇంగితం లేకపోతే ఎలా అని దుయ్యబడుతున్నారు.
బాబుగారు 60/- హిమాలయా వాటర్ బాటిల్స్ వాడుతున్నారని తెగ ఏడ్చారు paytm బులుగు పందులు..
ఇటుచూడండి ఈ 1/- రూపాయ్ బలుపు జీతగాడు కాలికి వాడే చెప్పులు ఎంత ఖరీదో..1,34,800/-♀️♀️ #100DaysOfYuvaGalam pic.twitter.com/5Jg62bE7dr— kumarkaza (@kumarkaza2) May 15, 2023