YCP: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభావం తగ్గుతోందా? వైసీపీ బలం తక్కువవుతోందా? సర్వేలు అదే చెబుతున్నాయి. ఇదివరకు ఉన్న ఎంపీ సీట్లు కూడా తగ్గుతాయని తాజా సర్వేలు అన్ని చెప్పడం గమనార్హం. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వైసీపీకి ఇక నూకలు చెల్లాయని చెబుతున్నాయి. అయినా అధికార పార్టీ మాత్రం అదే మంచిదని భావిస్తున్నట్లు సంబరాలు చేసుకోవడంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

ఏపీలో మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రతిపక్షాలు లాభపడే సూచనలున్నాయని తెలుస్తోంది. అయినా అధికార పార్టీ మాత్రం ఇదే మాకు చాలా బాగుందని చెబుతూ సంబరాలు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి ఇరవై రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓ నాలుగు సీట్లు తగ్గుతాయని సర్వేలు చెబుతున్నా వైసీపీ నేతలు అదేదో సంబరంగా చెప్పుకోవడం వివాదాలకు తావిస్తోంది. ఏపీలో సర్వేలు ఎప్పుడు కరెక్ట్ కాలేదని తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతల్లో ఆ భయం లేదని కూడా తెలుస్తోంది.
అభివృద్ధి పనులు అటకెక్కడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెబుతున్నారు. భవిష్యత్ లో కూడా ఇంకా ఎక్కువగా వ్యతిరేకత వస్తే పార్టీ భవితవ్యం ఏమిటనేది గందరగోళంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జగన్ దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టడం లేదు. ఫలితంగా పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోయే ప్రమాదంలో పడుతోందని తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఎదురుదెబ్బలే తగిలే సూచనలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నిధుల విషయంలో కూడా రాష్ట్రం పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మరోవైపు టీడీపీ బలం పుంజుకుంటోంది. దీంతో వైసీపీ ప్రతిష్ట మసకబారుతున్నా ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలనే వైసీపీ కల నెరవేరుతోందా? లేక టీడీపీ పుంజుకుని మరోమారు అధికారం దక్కించుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. వైసీపీకి సీట్లు తగ్గుతాయని తెలిసినా వారిలో మాత్రం ఏ భయం కనిపించడం లేదు. దీంతో వైసీపీ ఆశ నెరవేరుతుందా? టీడీపీ కల తీరుతోందా వేచి చూడాలి మరి.
Also Read:Jio vs Airtel: దూసుకొచ్చిన ఎయిర్ టెల్ 5జీ స్పీడ్.. ఈ ప్లాన్ తో జియోను దాటేస్తోందా?