Pawan Kalyan: పవన్ ప్రసంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాను చెప్పాల్సింది సూటిగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన ను ప్రజలు ఆదరించలేదు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ను ప్రజలు ఓడించారు. త్రిముఖ పోటీతో పాటు కారణాలు ఎన్నైనా ఉన్నా.. పవన్ ఓడిపోవడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంలో పవన్ ఎన్నడూ ప్రజలను నిందించలేదు. అలాగని రాజకీయాలు మానుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఎన్నికల్లో టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. అయితే పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ప్రజలను బెదిరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పవన్ ప్రస్తుతం జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజోలు నియోజకవర్గం లో పర్యటించారు.ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.’ జగన్ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోల్ వేసుకొని తగల పెట్టుకున్నట్టు. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. వైసీపీకి ఓటు వేస్తే మీ ఆడబిడ్డల భద్రత ఉండదు. యువతకు ఉపాధి అవకాశాలు రావు. రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. ప్రైవేట్ ఆస్తులను బలంగా లాక్కుంటారు’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు షర్మిల ధరించిన చీరపై జగన్ చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పు పట్టారు. సొంత చెల్లెలి దుస్తుల రంగుల గురించి జగన్ హేళన చేస్తూ మాట్లాడారని.. తోబుట్టువు ధరించిన దుస్తుల రంగులను ఎవరైనా చూస్తారా? పచ్చదనం ఉంటే చెట్లను చూడడం మానేస్తామా? పసుపు రంగులో ఉన్నాయని బంతి పూలను విగ్రహాలకు వేయడం మానేస్తామా? అంటూ పవన్ ప్రశ్నించారు. అయితే దీనిపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారని ఆరోపించారు.పవన్ వ్యాఖ్యలను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.అప్పట్లోనే ప్రజలను ఆక్షేపించలేదు.వైసీపీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల పాటు గడువు ఇచ్చారు.ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం విఫలం చెందడంతో పవన్ ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే తనను ఓడించిన ప్రజలను ఎన్నడూ దూషించలేదు. ఇప్పుడు సైతంప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. దానినే వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది. అనుకూల మీడియా పక్కదారి పట్టిస్తోంది. ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలే కానీ.. ఇలా బ్లాక్ మెయిల్ చేయడం తగదని నీలి మీడియా చెబుతోంది. అయితే దీనిని జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. పవన్ ప్రజలకు సూచనలు చేస్తారే తప్ప.. బ్లాక్ మెయిలింగ్ తరహా రాజకీయాలు ఉండవని చెబుతున్నారు. ఇటువంటి విమర్శలు వస్తున్న తరుణంలో పవన్ సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడుకోవడం ఉత్తమం.
సంక్షేమ పథకాలకు జగన్
తాత డబ్బులు ఇవ్వడం లేదుజగన్ పంచుతున్నది ప్రజల డబ్బు, పన్నుల డబ్బు
అప్పులు తెచ్చి.. అబద్దాలు ఆడుతూ ప్రచారం చేశాడుకూటమి ప్రభుత్వంలో సంపద సృష్టితో అద్భుత సంక్షేమం
కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి ఆనందించే వ్యక్తి జగన్ఆఖరికి సొంత చెల్లి కట్టుకున్న చీర రంగు… pic.twitter.com/qYsu5rjL86
— JanaSena Party (@JanaSenaParty) April 26, 2024