YSR Congress : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ.. దేశంలోనే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో గత పదేళ్ల పార్టీ వైభవం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ముఖ్యంగా ఆ పార్టీని అభిమానించే వీర సైనికులు ఇప్పటికీ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇప్పటికీ ఆ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. పటిష్ట కార్యవర్గాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది సోషల్ మీడియా విభాగం. ప్రత్యర్థులపై నిత్యం నిఘా ఉంటుంది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసే ప్రత్యర్థి నాయకుల జాబితా వారి వద్ద ఉంటుంది. అందుకే వైసిపి ప్రత్యర్ధులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లేకుంటే వైసీపీ సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అవుతారు. ఇప్పుడు జనసేన నేత కిరణ్ రాయల్ అలానే బుక్ అయ్యారు.
* వైసిపి పై దూకుడు
కిరణ్ రాయల్( Kiran Royal ) జనసేనలో బలమైన నేత. తిరుపతిలో నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. అయితే వైసీపీ విషయంలో దూకుడుగా ఉండేవారు. వైసీపీ నేతలపై విమర్శలు చేయడంలో వెనుకంజ వేసేవారు కాదు. వైసిపి ప్రభుత్వ హయాంలోనే ఒకటి రెండుసార్లు అరెస్ట్ అయ్యారు కూడా. ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాను టార్గెట్ చేసుకొని మాట్లాడేవారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టు ఓసారి సంచలనంగా మారింది. అటు తర్వాత కూడా ఆయన వైఖరిలో మార్పు లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత దూకుడు పెంచారు. వైసీపీపై ఓ రేంజ్ లో విమర్శలు చేసేవారు.
* జగన్ పై కిరణ్ రాయల్ ఆరోపణలు
ఇటీవల వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు కిరణ్ రాయల్. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అని.. ప్రజల కోసం జగన్ 1.0 ను చూశారని.. ఇకనుంచి కార్యకర్తల కోసం 2.0 చూస్తారని ప్రకటన చేశారు. దీనిపై తొలిసారిగా జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. రోబో 2.0 లో చిట్టి నాయుడుతో పోల్చారు జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు ఎవరూ పట్టించుకోరని కూడా తేల్చి చెప్పారు. ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఆగ్రహం తెచ్చిపెట్టింది. అందుకే ప్రత్యేక నిఘా పెట్టింది. కిరణ్ రాయల్ వైఫల్యాలను గుర్తించే పనిలో పడింది. ఈ తరుణంలోనే ఓ మహిళతో కిరణ్ రాయల్ వ్యవహరించిన తీరు బయట పెట్టినట్లు తెలుస్తోంది.
* అప్పట్లో జానీ మాస్టర్
గతంలో జనసేనకు( janasena ) చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో ఇదే తరహా వేధింపులు బయటపడ్డాయి. జానీ మాస్టర్ జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ లో ఒకరు. వైసిపి పై విమర్శలు చేయడానికి వెనుకంజ వేసేవారు కాదు. ఈ క్రమంలో ఆయనపై నిఘా పెట్టింది వైసీపీ సోషల్ మీడియా. ఆయన ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అన్నది తెలుసుకొని బయట పెట్టే ప్రయత్నం చేసింది. అది మరువక ముందే ఇప్పుడు కిరణ్ రాయల్ పై అదే తరహా నిఘా పెట్టి ఆయన వీడియోలను బయటకు తీసి ఇరుకున పెట్టింది. మొత్తానికి అయితే వైసీపీతో పెట్టుకున్న వారంతా ఇలా.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Never Mess With YSRCP SM pic.twitter.com/XQ22s8eJIM
— (@karnareddy4512) February 9, 2025