Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… పుష్ప 2 (Pushpa 2) సినిమాతో 1900 కోట్ల కలెక్షన్లను సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సమయంలో పుష్ప 2 సినిమా మీద సగటు ప్రేక్షకులందరూ ప్రశంశల వర్షం అయితే కురిపిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఇక తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపుని తీసుకొచ్చినప్పటికి ‘పుష్ప 2’ మాత్రం ఆయనకు భారీ మార్కెట్ ను క్రియేట్ చేసి పెట్టింది…ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసుకున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ పుష్ప 3 సినిమాని కూడా సెట్స్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం రాబోయే సినిమాలతో 2 వేల కోట్ల మార్క్ ను టచ్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఒక పెళ్లి వేడుకలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి బాంబు బ్లాస్ట్ చేస్తాడు. మరి ఆ వేడుకలో ఉన్న పుష్ప చనిపోతాడా..? అనే డౌట్ అయితే అందరిలో క్రియేట్ అవుతుంది. నిజానికి అక్కడ ఏ బాంబు పేలదట జస్ట్ మనకి పుష్ప 3 మీద హైప్ క్రియేట్ చేయడానికి అలా బాంబు బ్లాస్ట్ అయినట్టు గా క్రియేట్ చేసి చూపించారట…
ఇక వాళ్లు ఉన్న ఫంక్షన్లో కాకుండా వేరే ప్లేస్ లో బాంబు పేలే విధంగా సీనైతే రాసుకున్నారట. ఇక పుష్ప 3 లో దాన్ని రివీల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో పుష్ప 3 సినిమా చేస్తే అది మరింత రికార్డ్ లను కొల్లగొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో సినిమా వస్తే మాత్రం అది ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…