APSSDC Kurnool District : నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను తెలిపింది. తమ సొంత ఊరిలోనే ఉంటూ జాబ్ చేసుకుంటూ నెలకు రూ. 18 వేల వరకు పొందవచ్చని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ జాబ్ మేళ ను నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులైన యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని జిల్లాల వారీగా పదవ తరగతి మరియు ఆ పై చదువులు చదివి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంది. కొన్ని వందల మందికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగం మేళాలో ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని కోడుమూరు పట్టణంలో ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈనెల జనవరి 21న నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలపడం జరిగింది. ట్యూషన్ ఫైనాన్స్, IIFL వంటి ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం విద్యార్హత పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని తెలిపారు. జనవరి 21, 2025 ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా జరగనుంది.
ఈ జాబ్ మేళాను కర్నూలు జిల్లా కోడుమూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించనున్నారు. ఉద్యోగి అర్హతను బట్టి ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జీతం పదివేల నుంచి 18 వేల వరకు ఉంటుందని దాంతోపాటు సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి చెప్పుకొచ్చారు. ఈ ఉద్యోగమేలకు హాజరయ్య నిరుద్యోగులు రెజ్యూమ్ తో పాటు, విద్యార్హత జిరాక్సులు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని అధికారులు సూచించారు. అలాగే ఇందుకు హాజరయ్యే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగులైన యువతి, యువకులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.అలాగే ఈ ప్రక్రియకు సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి http://naipunyam.ap.gov.in/user-registration అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక మరి కోసం 8374376305 హరిబాబు అనే నెంబర్ను సంప్రదించాలని కోరారు. కర్నూల్ జిల్లాలోని కోడుమూరు లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగే ఈ జాబ్ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు పైన తెలిపిన సర్టిఫికెట్స్ ను తీసుకోని హాజరు కావాలి.ఇటువంటి మంచి అవకాశాన్ని నిరుద్యోగులు తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు తెలిపారు.