Homeఆంధ్రప్రదేశ్‌TDP First List: 25 మందితో టీడీపీ తొలి జాబితా రెడీ!

TDP First List: 25 మందితో టీడీపీ తొలి జాబితా రెడీ!

TDP First List: తెలుగుదేశం పార్టీ తన తొలి జాబితాను విడుదల చేయనుంది. 20 నుంచి 25 మంది అభ్యర్థులతో సంక్రాంతి నాటికి ఓ జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి వివాదాలు లేని, జనసేన కోరుకోని నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసి అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. కుప్పం నుంచి చంద్రబాబు, టెక్కలి నుంచి అచ్చెనాయుడు, మంగళగిరి నుంచి లోకేష్ వంటి పేర్లు తొలి జాబితాలో కనిపించనున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

టిడిపి అంతర్గతంగా కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై పార్టీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవిఆర్ఎస్ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో ఫోన్ ద్వారా సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వే కూడా చేయిస్తున్నారు. పండుగకు ముందు.. లేదా తర్వాత జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. జనసేనతో సీట్ల సర్దుబాటు, షెడ్యూల్ విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో మళ్లీ జాబితాలు వెలువడతాయని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు ‘ రా కదలిరా ‘ పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 22 పార్లమెంటు నియోజకవర్గంలోని 22 అసెంబ్లీ స్థానాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థుల విషయంలో చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు.

ఇప్పటివరకు ఆరు సభలు జరిగాయి. కనిగిరి కి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావలా దేవదత్, అచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబీ నాయన, తునికి యనమల దివ్య ఇన్చార్జిలుగా ఉన్నారు. వీరందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబు సంకేతాలు పంపారు. మిగతా 16 చోట్ల కూడా చంద్రబాబు సభలు నిర్వహించనున్నారు. అక్కడ ఇన్చార్జిలుగా ఉన్నవారు దాదాపు అభ్యర్థులేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ అభ్యర్థుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చిందో.. అక్కడ సభలు నిర్వహణకు సంబంధించి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో చంద్రబాబు చాలా నియోజకవర్గాల్లో రా కదలిరా కార్యక్రమంలో పాల్గొనున్నారు. గుడివాడకు వెనిగళ్ళ రామ్మోహన్, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్, కమలాపురం నియోజకవర్గానికి పుత్తా నరసింహారెడ్డి, అరకు దున్నుదొర, మండపేటకు వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉరవకొండకు పయ్యావుల కేశవ్, కోవూరుకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పత్తికొండకు కెఇ శ్యాంబాబు, గోపాలపురం నియోజకవర్గానికి మద్దిపాటి వెంకటరాజు, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, మాడుగులకు పివిజి కుమార్, టెక్కలికి అచ్చెన్నాయుడు, ఉంగటూరుకు గన్ని వీరాంజనేయులు, చీరాలకు కొండయ్య యాదవ్ ఇన్చార్జులు గా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోనే చంద్రబాబు రా కదలిరా సభలు జరగనున్నాయి. వీరంతా దాదాపు అభ్యర్థులేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి పేర్లతోనే తొలి జాబితా టిడిపి విడుదల చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular