https://oktelugu.com/

MPDO Rasalilalu : ఇంట్లో ఇల్లాలు.. లాడ్జీలో ప్రియురాలు.. ఎంపీడీవో రాసలీలల గుట్టు రట్టు!

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణం అయ్యాయి. ఎవరి అవసరాల మేరకు వారు స్త్రీ, పురుష బేధం లేకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ఎంపీడీవో వివాహేతర సంబంధం గుట్టును కుటుంబ సభ్యులే రట్టు చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 28, 2024 / 04:30 PM IST

    MPDO Rasalilalu

    Follow us on

    MPDO Rasalilalu :  నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు కామన్‌ అయ్యాయి. మీడియా, సోషల్‌ మీడియా, సినిమాల ప్రభావంతో చాలా మంది పెళ్లికి ముందే సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్, ఇతర కారణాలతో కాలేజీ స్థాయిలోనే యువతీ యువకులు దగ్గరవుతున్నారు. దానికి రిలేషన్‌షిప్‌ అనే పేరు పనెడుతున్నారు. తర్వాత పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. మొగుడు నచ్చకపోయినా.. పెళ్లాం బాగా లేకపోయినా.. పాత ప్రియుడు, ప్రియురాలితో కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. ఇది ఒకరకం వివాహేతర సంబంధం. ఇక కొందరు.. అవసరాలను బట్టి పరిచయాలు పెంచుకుంటున్నారు. తర్వాత వివాహేతర సంబంధాలుగా మార్చుకుంటున్నారు. కారణం ఏదైనా రిలేషన్‌షిప్‌ అనే పదం వాడుతూ.. అనైతిక సంబంధాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా ఓ ఎంపీడీవో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయారు.

    రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడి..
    ఆయన ఓ ఎంపీడీవో. విధి నిర్వహణలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తనకు పరిచయమైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. కుటుంబాన్ని కాదని కొన్నాళ్లుగా ఆమెతోనే ఉంటున్నారు. అనుమానించిన కుటుంబీకులు నిఘా పెట్టారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఎంపీడీవోను రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నగరంంలో జరిగింది. నగరంలోని కర్నూలు రోడ్డు కూడలిలోని ఓ లాడ్జీలో ఆదివారం ప్రియురాలితో ఉన్న ఎంపీడీవోను పట్టుకున్నారు.

    ఏం జరిగిందంటే..
    నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న అధికారి ఆయన, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఏఎన్‌ఎంతో పరిచయం అయింది. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి దూరమయ్యారు. భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇంటికి కూడా రావడం లేదు. దీంతో కుటుంబీకులు ఎంపీడీవో కదలికలపై నిఘా పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులోని ఓ లాడ్జీలో ప్రియురాలితో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో భార్య, కుమార్తె, కొడుకు అక్కడకు చేరుకున్నారు. ప్రియురాలితో రొమాన్స్‌ చేస్తున్న ఎంపీడీవోను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.

    అదుపులోకి తీసుకున్న పోలీసులు..
    లాడ్జీ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఎంపీడీవోతోపాటు ఆయన ప్రియురాలిని ఠాణాకు తరలించారు. ఎస్సై అనిత వారికి కౌన్సెలింగ్‌ చేసింది. అందరూ కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. వీధికి ఎక్కి పరువు తీసుకోవద్దని సూచించారు. లేదంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని తెలిపారు.