Homeఆంధ్రప్రదేశ్‌TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన ఈ టిడిపి నేత పార్టీతో పాటు నాయకత్వానికి చాలా విధేయత గా ఉంటారు. అయితే ఇటీవల టిడిపి నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన మంత్రి పదవి ఇవ్వకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కాపు అంశంపై మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను ఆకాశానికి తీశారు. ఆయనను తేలిగ్గా తీసుకోవడం వల్లే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు కామెంట్స్ పై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవి రాకపోవడంతో..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు బోండా ఉమామహేశ్వరరావు. కాపుల కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే వివిధ సమీకరణలో అది వీలు కాలేదు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు మాత్రం పార్టీతో పాటు నాయకత్వంపై విధేయతతోనే వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి, కాపుల అంశం వంటి వాటిపై బాహటంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ముద్రగడ పద్మనాభం సేవలను కొనియాడడమే కాదు.. ఆయనను టిడిపి నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీని ఇరకాటంలో పెట్టేలా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతుండడంపై మాత్రం కూటమి పార్టీలో కొత్త చర్చ నడుస్తోంది.

వైసీపీ నేతలతో..
గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సైతం ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. త్వరలో కాపుల ఆత్మీయ సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో బోండా ఉమామహేశ్వరరావు కు చెడిందా? అనే అనుమానం కలుగుతోంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ లైన్ దాటి ఎక్కడా వ్యవహరించలేదని టిడిపిలోనే ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే టిడిపిలో ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు కామెంట్స్ పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper