AP Deputy CM Pawan Kalyan : పవన్ ప్రాణాలకు ముప్పు? కేంద్రం హెచ్చరిక.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తే ఎలా ఉంటుంది?

పవన్ కల్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ప్రధాని పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోదీ పవన్ ను ప్రత్యేకంగా ‘తుఫాన్ ’ అంటూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను రక్షించుకోవాల్సి బాధ్యత ఉందని భావిస్తున్నారు. అందుకే పవన్ విషయంలో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిఘా వర్గాలు పవన్ కు ఉన్న ముప్పును పసిగట్టినట్లు తెలుస్తోంది

Written By: Srinivas, Updated On : July 22, 2024 10:40 am
Follow us on

AP Deputy CM Pawan Kalyan :  పవన్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పవన్ క్రేజ్ తగ్గలేదు. అప్పుడు, ఇప్పుడు ట్రెండీగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 2 వ్యక్తిగా ఉన్న పవన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కు సంబంధించి నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయనకు కొన్ని వర్గాల నుంచి ముప్పు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరం అని తెలుస్తోంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాక పవన్ ప్రజల్లో తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఆయన రాజకీయాల్లోకి రాగానే అధికార పదవులు అనుభవించలేదు. దాదాపు పదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు. కానీ గత ఐదేళ్లు మాత్రం అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి పవన్ కంట్లో నలుసుగా మారాడు. అయితే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చాక పవన్ రాజకీయాల్లో వెంటనే రాణించలేదు. అంతేకాకుండా సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసినా ఒకే ఒక్క సీటు గెలిచారు. దీంతో పవన్ ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అందువల్ల అప్పుడు పవన్ కు పెద్దగా ముప్పు లేదు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి పవన్ అధికారంలోకి వచ్చాడు. ఒక రకంగా గత ప్రభుత్వ పతనానికి జనసేన అధినేత పవన్ కూడా కారణమని తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ పై కొందరు కక్షగట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని అంటున్నారు. అయితే?

ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఆయన ప్రతిపక్షంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది.ఏపీ మాజీ ముఖ్యమంత్రి సైతం తనకు కొన్ని వర్గాల నుంచి ముప్పు ఉందని తెలపడంతో ఆయనకూ జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. అయితే గత ప్రభుత్వం పడిపోవడానికి పవన్ కూడా కారణమని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయకు వివిధ వర్గాల నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పవన్ విషయంలో కుట్రలు పన్నుతున్నారని, ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని నిఘా వర్గాలు తెలిపారు.

పవన్ కల్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ప్రధాని పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోదీ పవన్ ను ప్రత్యేకంగా ‘తుఫాన్ ’ అంటూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను రక్షించుకోవాల్సి బాధ్యత ఉందని భావిస్తున్నారు. అందుకే పవన్ విషయంలో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిఘా వర్గాలు పవన్ కు ఉన్న ముప్పును పసిగట్టినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న సమమయంలో పవన్ కల్యాణ్ నిత్యం ప్రజల్లోనూ ఉంటూ గడిపారు. ఇప్పుడు అధికారంగా మరిన్ని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు.

అయితే పవన్ కు భద్రత విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వలె జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందా? లేక అదనంగా మరింత భద్రతను కల్పించేందుకు బ్లాక్ కమాండోల సంఖ్య పెంచుతారా? అని అనుకుంటున్నారు.