https://oktelugu.com/

NATS: చికాగోలో నాట్స్‌ ఆత్మీయ సమ్మేళనం.. పంచ లక్ష్యాలను నిర్దేశించిన అధ్యక్షులు.. హాజరైన తెలుగువారు..

NATS: నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ చికాగో చాప్టర్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాట్స్‌ కార్యనిర్వాహక సభ్యులు, పలు ఇతర తెలుగు సంఘాలకు చెందిన నాయకులు, అతిథుల హాజరయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 22, 2024 / 10:12 AM IST

    NATS-Chicago

    Follow us on

    Chicago: అగ్రరాజ్యం అమెరికాలో నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) లీడర్‌షిప్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం చికాగో చాప్టర్‌ ఆధ్వర్యంలో జూలై 20న(శనివారం) మాల్‌ ఆఫ్‌ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాట్స్‌ కార్యవర్గ సభ్యులతోపాటు అమెరికాలోని పలు తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు, ముఖ్య అతిథులు హాజరయ్యారు. దీంతో ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాట్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మదన్‌ పాములపాటిని కార్యనిర్వాహక సభ్యులు, తెలుగు సంఘాలకు చెందిన ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఇక ఈ సదస్సుకు 450 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని మాజీ బోర్డు సభ్యుడు శ్రీనివాస్‌ అరసాడ, నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఆర్కే బాలినేని, జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ జమ్ముల, చాప్టర్‌ లీడ్‌ వీర తక్కెళ్లపాటి ఆర్గనైజ్‌ చేశారు. నాట్స్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేని, మాజీ చైర్మన్‌ శ్రీధర్‌ అప్పసాని, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడి, శేఖర్‌ అన్నె, బోర్డు సభ్యులు రాజ్‌ అల్లాడ, అడ్వయిజరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ సుధీర్‌ అట్లూరి, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ రమేశ బెల్లం ఈ కార్యక్రమంలో పాల్గొని నాట్స్‌ చికాగో టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను, వారి కృషి, నిబద్ధతను ప్రశంసించారు. నాట్స్‌ నూతన అధ్యక్షుడు మదన్‌ పాములపాటిని అభినందించారు. నాట్స్‌తో కలిసి పనిచేయడానికి తెలుగు సంఘాల ప్రతినిధులు ముందుకు వచ్చారు. వీరిలో తానా  మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల గారు,
    తానా కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ డా. ఉమా కటికి, హేమ కానూరు, హర్ష గరికపాటి,  కృష్ణమోహన్, హను చెరుకూరి, చిరు గళ్ల, రవి కాకర, కృష్ణ చిట్టూరి తదితరులు ఉన్నారు.

    పంచ లక్ష్యాలను నిర్దేశించిన అధ్యక్షుడు..
    కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు మదన్‌ పాములపాటి మాట్లాడుతూ తనను సత్కరించిన నాట్స్‌ కార్యవర్గానికి, చికాగో చాప్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య జరగడం సంతోషాన్ని, భావోద్వేగాన్ని కలగజేసిందన్నారు.   15 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన నాట్స్‌ 8వ అధ్యక్షుడిగా తాను ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. సామాన్య స్వచ్ఛంద సేవకుడి నుంచి అధ్యక్షుడిగా ఎదగడం నాట్స్ లోనే సాధ్యమని తెలిపారు. తన సుదీర్ఘ ప్రయాణంలో తనతోపాటు నడిచి తనను అధ్యక్షుడిగా ఎదగడానికి సహాయం అందించిన తోటి కార్యవర్గ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. 20 ఏళ్లుగా తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు అండదండలు అందించి ప్రోత్సహించిన తన అర్ధాంగి సుమతి, పిల్లలు మహిత, అక్షితలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా తన పంచ లక్ష్యాలను ఈ వేదిక మీదుగా ప్రకటించారు. మునుపటి అధ్యక్షుడు చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగించడం, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండేలా నాట్స్‌ను అమెరికా అంతటా విస్తరించడం, యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగం కల్పించడం, వారిని నాట్స్‌లో కీలకపాత్ర పోషించేలా ప్రోత్సహించడం,  నాట్స్‌ ద్వారా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించేలా కృషి చేయడం, సేవే గమ్యం అనే నినాదంతో ప్రవాస తెలుగువారికి సేవాహస్తం అందించడం అని తెలిపారు. ఇందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాట్స్‌ విజన్, మిషన్‌ను ఐక్యంగా ముందుకు నడిపించాని పిలుపునిచ్చారు.


    అతిథులకు సత్కారం..

    ఇక కార్యక్రమలో నాట్స్‌ చికాగో టీం బోర్డు సభ్యులు శ్రీనివాస పిడికిటి, ఈసీ సభ్యులు ఆర్కే బాలినేని, శ్రీహరీశ్‌ జమ్ముల, ఇమాన్యేయల్‌ నీల, మాజీ బోర్డు సభ్యులు మహేశ్‌ కాకరాల, మూర్తి కొప్పాక, శ్రీనివాస్‌ బొప్పన ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చైర్మన్‌ ప్రశాంత్‌ చికాగో చాప్టర్‌ టీం నుంచి వీర తక్కెళ్లపాటి, హవీల దేవరపల్లి, బిందు వీధులమూడి, రోజా చెంగలశెట్టి, భారతి పుట్ట, రజియా వినయ్, సిరి బచ్చు, అనూష కదుము, గ్రహిత బొమ్మిరెడ్డి, భారతి కేసనకుర్తి, ప్రియాంక పొన్నూరు, సింధు కంఠమనేని, చంద్రిమ దాడి, నరేంద్ర కడియాల, శ్రీనివాస ఇక్కుర్తి, మహేశ్‌ కిలారు, చెన్నయ్య కంబల, నవీన్‌ జరుగుల, అంజయ్య వేలూరు, ఈశ్వర్‌ వడ్మన్నాటి తదితరులను సత్కరించారు.

    ఆకట్టుకున్న భరత నాట్యం..
    ఇక ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన అతిథులను చిన్నారులు తమ భరత నాట్యంతో అలరించారు. రవి తోకల, సునీత విస్సప్రగడ తమ గాత్రంలో ఆకట్టుకున్నారు. పాల్గొన్న వారికి రుచికరమైన భోజనాన్ని అందించిన దాతలు బ్లో ఓ బిర్యానికి చెందిన అరవింద్‌ కోగంటి, గిరి మారినిలను, వేదికను అందించిన అజయ్‌ సుంకర, వినోజ్‌ చెనుమోలు, ప్రమోద్‌ చింతమేని, ఆకర్షణీయమైన అలంకరణలను అందించిన సాంస్కృతి డెకరేషన్స్‌ నుంచి బిందు బాలినేనిని అభినందించారు. మాధురి పాటిబండ్ల, క్రాంతి ఈ సమ్మేళనానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.