Personal Loan: గూగుల్ పే బంపర్ ఆఫర్.. రూ.8 లక్షలు మీ ఖాతాల్లోకి..

Personal Loan: ప్రఖ్యాత మనీ ట్రాన్సఫర్ యాప్ గూగుల్ పే వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సులభంగా ఖాతాదారుల అకౌంట్లోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. అయితే ఈ డబ్బులు ఉచితంగా ఇవ్వడం లేదు. దీనిని లోన్ రూపంలో తీసుకొని నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. సరైన డాక్యుమెంట్లు, తదితర కారణాలతో చాలా మందికి రుణ సదుపాయం ఉండదు. కానీ గూగుల్ పే పరిమిత పర్సనల్ డిటేయిల్స్ తీసుకొని రుణాలను అందిస్తుంది. ఇది నేరుగా […]

Written By: Srinivas, Updated On : April 25, 2023 12:02 pm
Follow us on

Personal Loan: ప్రఖ్యాత మనీ ట్రాన్సఫర్ యాప్ గూగుల్ పే వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సులభంగా ఖాతాదారుల అకౌంట్లోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. అయితే ఈ డబ్బులు ఉచితంగా ఇవ్వడం లేదు. దీనిని లోన్ రూపంలో తీసుకొని నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. సరైన డాక్యుమెంట్లు, తదితర కారణాలతో చాలా మందికి రుణ సదుపాయం ఉండదు. కానీ గూగుల్ పే పరిమిత పర్సనల్ డిటేయిల్స్ తీసుకొని రుణాలను అందిస్తుంది. ఇది నేరుగా మీ అకౌంట్లోకి పడే విధంగా చేస్తుంది. మరి ఈ లోన్ సౌకర్యం ఎలా ఉందో చూద్దాం.

బ్యాంకు రుణం పొందాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు తప్పనిసరి. ఇవన్నీ సమర్పించినా ఏదో చిన్న కారణంతో లోన్ కు ఎల్జిబిలిటీ ఉండదు. కానీ కొన్ని యాప్ లు ఈజీ రుణాన్ని అందిస్తున్నాయి. అలా అని అన్నీ యాప్ లను నమ్మే విషయంలో జాగ్రత్త పడాలి. అయితే ఇంతకాలం మనీ ట్రాన్స్ ఫర్ కు ఎంతో సహకరించిన గూగూల్ పే కొంతమంది సెలెక్టెడ్ వినియోగదారులకు లోన్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది మీరు మనీ ట్రాన్స్ ఫర్ చేసే వాటిని ఆధారంగా రుణం ఇస్తుంది.

గూగుల్ పే ద్వా రా లోన్ పొందానుకునేవారు. ఈ యాప్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత DMI ఫైనాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేస్తే అందులో వివిధ రకాల రుణాల మొత్తాలు కనిపిస్తాయి. ఇందులో రూ.10 వేల నుంచి రూ.8 లక్షల వరకు లోన్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నెలవారీ పేమేంట్ ను మీకు అనుగుణంగా సెట్ చేసుకొని ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

 

జీ పే అందించే రుణాలపై 15 శాతం వడ్డీతో ప్రారంభం అవుతుంది. అయితే మీరు ఎంచుకున్న ఈఎంఐ, నెలలను భట్టి వడ్డీ రేట్లలో మార్పులు రావొచ్చు. ఇక లోన్ కావాలనుకునేవారికి 2 నిమిషాల్లోనే ఎలిజిబిలిటీ విషయం తేలిపోతుంది. అయితే ఎల్జిబిలిటీ ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందుగా పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్ల వివరాలు ఎంటర్ చేయాలి. ఇవి ఇచ్చిన తరువాత లోన్ అర్హత పై డిక్లేర్ చేస్తుంది. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి సబ్మిట్ చేస్తే డబ్బులు మీ అకౌంట్లోకి పడుతాయి.