Payal Rajput: ‘మంగళవారం’ నాడు పాయల్ రాజ్ పుత్ బట్టలు తొలగించిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్!

Payal Rajput: 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 ఒక సంచలనం. ఈ మూవీతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. యధార్థ సంఘటనల ఆధారంగా న్యూ ఏజ్ లవ్ డ్రామా అజయ్ భూపతి తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపిన చిత్రం ఇది. హీరో కార్తికేయకు కూడా బ్రేక్ వచ్చింది. ఈ మూవీలో […]

Written By: Shiva, Updated On : April 25, 2023 12:29 pm
Follow us on

Payal Rajput: 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 ఒక సంచలనం. ఈ మూవీతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. యధార్థ సంఘటనల ఆధారంగా న్యూ ఏజ్ లవ్ డ్రామా అజయ్ భూపతి తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపిన చిత్రం ఇది. హీరో కార్తికేయకు కూడా బ్రేక్ వచ్చింది. ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాయల్ రాజ్ పుత్ ఎలాంటి మొహమాటం లేకుండా శృంగార సన్నివేశాల్లో నటించింది.

ఆర్ఎక్స్ 100 తర్వాత ఈ ప్రాజెక్ట్ లో భాగమైన ముగ్గురికీ బ్రేక్ రాలేదు. పాయల్ రాజ్ పుత్ పలు చిత్రాల్లో నటించినా హిట్ దక్కలేదు. ఆమె కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇక అజయ్ భూపతి రెండో చిత్రంగా చేసిన మహాసముద్రం ఆశించిన విజయం సాధించలేదు. అటు కార్తికేయ కూడా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి మరోసారి కలిశారు. వీరి కాంబినేషన్ లో ‘మంగళవారం’ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కుతుంది.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు. టాప్ లేకుండా న్యూడ్ గా ఉన్న పాయల్ రాజ్ పుత్ లుక్ అందరినీ ఆకర్షించింది. ఆర్ఎక్స్ 100 మూవీని మంగళవారం తలపించింది. పాయల్ ఫస్ట్ లుక్ మూవీ మీద అంచనాలు పెంచేసింది. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ సన్నివేశాలు, కంటెంట్ కి ఏమాత్రం కొదవ ఉండదని అర్థం అవుతుంది. పాయల్ ని అజయ్ భూపతి మరోసారి సంచలన పాత్రలో ప్రజెంట్ చేయడానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది.

మంగళవారం మూవీలో పాయల్ పాత్ర పేరు శైలజ అట. ఆమె ఇంటెన్స్ లుక్ కాకరేపుతుంది. పాయల్ సాహసం పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతుంది. మంగళవారం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మధుర మీడియా వర్క్స్, ఏసీ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్నాయి. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ తో మరింత ఆకట్టుకున్నారు. మొత్తంగా మంగళవారం మూవీ మీద అంచనాలు పెరిగాయి.