https://oktelugu.com/

Telugu Media : అయ్యయ్యో చేతిలో ” సబ్” లు పోయేనే.. సార్ ఒంటరి అయిపోయేనే?!

కోరుకున్న ఎడిటర్ పోస్ట్ దక్కలేదు. సెంట్రల్ డెస్క్ ను తన వర్గం వారితో నింపినప్పటికీ ఫలితం లేదు. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లు తనతో సఖ్యతగా ఉన్న "సబ్" లు దూరమైపోయారు. దీంతో విఖ్యాత జర్నలిస్టు ఒంటరి అయిపోయారు. " ఒంటరినైపోయాను. ఇక ఇంటికి ఏమని పోను" అని విరహ గీతాలను ఆలపిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 29, 2024 / 11:24 AM IST

    Telugu Media

    Follow us on

    Telugu Media :  మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. ఆ పత్రిక ఎడిటర్ అక్టోబర్ లో రిటైర్ అవుతున్నారని.. ఇన్నాళ్లపాటు సెంట్రల్ డెస్క్, నాణ్యత విభాగాన్ని పరిశీలించిన అసిస్టెంట్ ఎడిటర్.. ఆ పోస్టు ఎక్కబోతున్నారని.. కానీ ఆ అసిస్టెంట్ ఎడిటర్ ఆశల మీద ఆ సంస్థ ఎండి నీళ్లు చల్లారు. మొన్నటిదాకా జిల్లాల పర్యటనకు ఆయనను తీసుకెళ్లిన ఎండీ.. తీరా ఎడిటర్ పోస్టు లో వేరే వ్యక్తిని నియమించారు. దీంతో నాటి నుంచి ఆ అసిస్టెంట్ ఎడిటర్ కు నిద్ర లేని రాత్రులు పరిచయమయ్యాయి..”సంస్థ కోసం ఎంతో చేశాను. ఎంతోమందిని చేరదీశాను. సంస్థ చెబితే చివరికి ఓ సబ్బుల కంపెనీతో డీల్ కూడా మాట్లాడాను. ఇన్ని సంవత్సరాలపాటు నాతో చాకిరీ చేయించుకుని.. నాకు ఎడిటర్ పోస్ట్ దక్కే లోపే అన్యాయం చేశారు. చాలా ఇబ్బందిగా ఉంది. కరోనా సమయంలో మేనేజ్మెంట్ చెప్పిన వారందరినీ తొలగించాను. సంస్థపై ఆర్థిక భారం పడకుండా చూశాను. చాలామంది నా నిర్ణయం వల్ల రోడ్డు మీద పడ్డారు. అయినప్పటికీ మేనేజ్మెంట్ నాకు ఎడిటర్ పోస్ట్ ఇవ్వలేదని” ఆ అసిస్టెంట్ ఎడిటర్ వాపోతున్నారట.

    ఎడిటర్ వైపు వెళ్లిపోయారట..

    ఎప్పుడైతే అసిస్టెంట్ ఎడిటర్ కు ఎడిటర్ పోస్ట్ ఇవ్వరని తెలిసిందో.. అప్పుడే సెంట్రల్ డెస్క్ లో “సబ్” లు ఎడిటర్ వైపు వెళ్ళిపోయారట. కాబోయే ఎడిటర్ తో సఖ్యతను ప్రదర్శిస్తున్నారట. దీంతో ఆ అసిస్టెంట్ ఎడిటర్ ముఖం చిన్నబోతోందట. కొద్ది రోజులపాటు ఆఫీస్ ముఖం కూడా చూడలేదట. తను చేరదీసిన “సబ్” లు మొత్తం కాబోయే ఎడిటర్ వైపు వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నారట. మొత్తంగా చూస్తే ఆయన జర్నలిజం బ్యాచ్ మెట్లు ఇప్పటికే ఎడిటర్లు అయిపోయారు. ఈయన కూడా ఎడిటర్ కావాలని భావించారు. కానీ చివరికి ఇలా ఎటూ కాకుండా మిగిలిపోయారు. బాహుబలి -2 2 సినిమాలో “నన్నెందుకు రాజును చేయలేదురా” అని బిజ్జల దేవ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. “మన్నించండి ప్రభూ.. మీరు రాజు కాకపోవడానికి కారణం అవిటితనం కాదు. మీ అవిటి బుద్ధి” అని కట్టప్ప తిరిగి సమాధానం చెబుతాడు.. ఇప్పుడు ఆ అసిస్టెంట్ ఎడిటర్ విషయంలోనూ పై వృత్తాంతమే జరిగింది. ఎందుకంటే సంపాదకీయ విభాగాన్ని తన వారితో నింపారు. అర్హత లేకున్నా ముఖ్యస్థానాల్లో కూర్చోబెట్టారు. అదే ఆయనకు ప్రతిబంధకంగా మారింది. ఇదే విషయాన్ని ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ చెప్పడంతో.. ఖిన్నుడు కావడం ఆ అసిస్టెంట్ ఎడిటర్ వంతయింది.. అందుకే అంటారు పెద్దలు ఎవరు చేసుకున్న కర్మకు వారి బాధ్యులని..