AP government Deal With Google: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అంతర్జాతీయ కంపెనీలను రప్పించేందుకు విజనరీ, ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపారు. అమరావతిలో స్థలాలు కూడా కేటాయిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నారు. 1 గిగావాట్ సామర్థ్యంతో హైపవర్ సేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీవైష్ణవ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో (అక్టోబర్ 14న) ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్ట్ భారతీయ డిజిటల్ పరిశ్రమలో ఒక భారీ మైలురాయి అవుతుంది.
ఆర్థిక ప్రతిఫలం..
గూగుల్‌లో పెట్టుబడితో 2028–2032 మధ్య కాలంలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు సంవత్సరానికి సుమారు రూ.10,518 కోట్ల ఆదాయం లభించే అంచనా ఉంది. ఇది ఏపీ అభివృద్ధిలో భారీ మూలధన ప్రవాహం. విదేశీ పెట్టుబడులకు తీసుకురాగల రూపాంతరం సూచిస్తుంది.
ఉపాధి, పరిశ్రమలపై ప్రాభావం
ఈ డేటా సెంటర్ నిర్మాణం, ఆపరేషన్ సమయంలో వార్షికంగా సుమారు 1,88,220 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. దీన్ని వలన సమాచార సాంకేతిక రంగంలో, ఇంజినీరింగ్, సరఫరా శ్రేణులు, క్లౌడ్ సేవల వగైరా విస్తరణ సాధ్యమవుతుంది.
ఏఐ హబ్‌గా విశాఖ..
ఈ డేటా సెంటర్ ని కేంద్రంగా విస్తరించే ఎమర్జింగ్ టెక్నాలజీస్ క్లస్టర్‌గా ఏపీ ప్రభుత్వం విశాఖను ‘ఏఐ సిటీ వైజాగ్’’గా గుర్తించి, అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా విశ్లేషణ హబ్‌గా అభివృద్ధి చేస్తోంది. ఇది ఏపీలో డిజిటల్ విప్లవానికి దోహదం, ఆర్థిక సాకారం రెండింటికీ దారి చూస్తుంది.
ప్రాజెక్ట్‌తో కలిగే ప్రయోజనాలు..
– సింగిల్విండో క్లియరెన్స్ విధానాలు
– నలుగురు విద్యుత్ సరఫరా, పునరుత్పాదక శక్తి వినియోగం
– ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ విస్తరణ
– రోడ్లు, రవాణా, ఇంధన వ్యవస్థల మెరుగుదల
ఈ పెట్టుబడి ఏపిలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం సాంకేతిక శక్తి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పెద్ద ప్రేరణగా నిలవనుంది. విశాఖపట్నం సాంకేతిక రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదగడం ట్రెండ్ ముఖ్యంగా కనిపిస్తుంది.