Hamas Hostages Released: రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్–హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో దిగివచ్చిన ఇరు దేశాలు శాంతి చర్చలకు అంగీకరించాయి. ఇందులో భాగంగా కొన్ని అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా మొదట హమాస్ తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా 2 వేలకుపైగా యుద«్ధ ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. హమాస్ విడుదల చేసిన బందీల్లో ఒక్క మహిళ కూడా లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
20 మంది విడుదల..
గాజా ప్రాంతంలో జరుగుతున్న శాంతి ప్రయత్నాల భాగంగా హమాస్ మిగతా 20 మంది ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసింది. రెండు సంవత్సరాల తర్వాత స్వదేశం చేరిన వారు కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగ క్షణాలను అనుభవించారు. విడుదలైన వారందరూ ప్రాణాలతో ఉన్నారని హమాస్ ప్రకటించగా, విడుదల జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.
మహిళలు ఏమైనట్లు..
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణల్లో, మహిళలను అపహరించిన సంఘటనలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రతిస్పందనకు దారి తీశాయి. ఇప్పుడు విడుదలలో వారు లేకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అపహరించబడిన మహిళలు ఇంకా హమాస్ అధీనంలో ఉన్నారా? వారిలో కొంతమంది ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారా? హింసాత్మక చర్యలకు గురైన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఈ విషయంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.
హమాస్ వ్యూహంలో మహిళల వాడకం
అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, మహిళా బందీలను హమాస్ రాజకీయ ఒత్తిడికి సాధనంగా ఉపయోగించి, చర్చల్లో ప్రాధాన్యత సాధించడానికి ప్రయత్నించవచ్చు. మహిళలు మానసిక, సామాజిక ప్రభావం ఎక్కువ కలిగించే బందీలు కావడంతో, వారిని విడిచిపెట్టడం ఆలస్యం చేయడం ద్వారా హమాస్ తన డిమాండ్లను పెంచే అవకాశం ఉంటుంది. ఇది మానవహక్కుల ఒప్పందాలకు విరుద్ధమని, యుద్ధ నేరంగా పరిగణించవచ్చని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ సంస్థల ప్రతిస్పందన
మహిళా బందీలు విడుదల కాలేదనే వార్తకు గ్లోబల్ మానవహక్కుల సంస్థలు కఠినంగా స్పందించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా తదితర దేశాలు హమాస్ చర్యలను ఖండించాయి. మహిళల స్థితి, ఆరోగ్య పరిస్థితిపై తక్షణ సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సైనిక రంగం, బందీల కుటుంబ సభ్యులు, సామాజిక సంస్థలు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మహిళా బందీలు ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం రాకపోతే, బందీలపై దాడులు మరింత వివాదాస్పదంగా మారి, శాంతి చర్చలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.