KTR And Lokesh: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం.. శాశ్వత మిత్రత్వం కూడా ఉండదు. కాలానికి తగ్గట్టు.. పరిస్థితులకు తగ్గట్టు శత్రువులు మిత్రులు అవుతారు.. మిత్రులు శత్రువులుగా మారుతారు. అయితే హుందాతనం పాటించిన వారే గుర్తింపు పొందుతారు. అయితే ఒక రెండేళ్ల పాటు వెనక్కి వెళ్తే.. తెలుగుదేశం పార్టీ ఎన్నెన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపంలో.. తెలంగాణలో బిఆర్ఎస్ రూపంలో… ఇక తెలుగుదేశం పార్టీ క్లోజ్ అనుకున్నారు. అంతలా ఆ పార్టీని వెంటాడారు కెసిఆర్, జగన్. అయితే ఇప్పుడు జగన్ మాట అటు ఉంచితే కేసిఆర్, కేటీఆర్ విషయంలో మాత్రం తెలుగుదేశం నాయకత్వం ఆ స్థాయిలో విరుచుకు పడడం లేదు. హుందా గానే వ్యవహరిస్తోంది.
Also Read: ఏపీలో దసరా సెలవుల్లో మార్పు.. ఏకంగా 12 రోజులు
* రేవంత్ సంచలన ఆరోపణలు..
మొన్న మధ్యన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) సంచలన ఆరోపణలు చేశారు. నారా లోకేష్ ను కేటీఆర్ అర్ధరాత్రి కలిసారని.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మద్దతు కోసం ప్రయత్నించారన్నది రేవంత్ ఆరోపణ. లేలే లోకేష్ ను కలవాల్సిన అవసరం తనకు ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. అయినా కలిస్తే తప్పేముందని వ్యాఖ్యానించారు. అయితే ఆ వివాదం పై తాజాగా మాట్లాడారు నారా లోకేష్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఎందుకు కలవకూడదని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో కేటీఆర్ ను కలిసినట్లు చెప్పారు. కేటీఆర్ ను కలవాలంటే రేవంత్ రెడ్డిని అడగాలా అంటూ ఆ వివాదానికి ఒక బ్రేక్ ఇచ్చారు. కేటీఆర్ ఇబ్బంది పడకుండా మాట్లాడారు.
* టిడిపి అంతానికి కుట్ర..
అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చూశారు కేసీఆర్ అండ్ కేటీఆర్( KTR). కానీ ప్రస్తుతం అదే టిఆర్ఎస్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ నిలబడుతుందా లేదా అన్న అనుమానం ఉంది. ఇటువంటి సమయంలో ఆ పార్టీని నిలువరించాలన్న ప్రయత్నం చేయలేదు. పైగా కవితను టిడిపిలోకి తీసుకొని రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారా అన్న ప్రశ్నకు కూడా లోకేష్ తనదైన రీతిలో సమాధానం చెప్పారు. కవితను పార్టీలోకి తీసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డిని చేర్చుకోవడం అన్నట్టు మాట్లాడారు. అది ఎంత మాత్రం సాధ్యం కాదని చెప్పారు. బిఆర్ఎస్ కష్టాల్లో ఉండగా.. ఆ పార్టీని మరింత కష్టాల్లో నెట్టే ప్రయత్నం చేయమని లోకేష్ సంకేతాలు ఇచ్చారు.
* ఎన్నెన్నో ఇబ్బందులు..
తెలుగుదేశం పార్టీ విషయంలో కెసిఆర్ ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశారు. చివరకు ఏపీలో టిడిపి ప్రతిపక్షంలో ఉంటే జగన్తో చేతులు కలిపి మరింత ఇబ్బందులు పాలు చేసేలా చేశారు. హరికృష్ణ చనిపోయినప్పుడు పొత్తుల గురించి మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. డేటా చోరీ పేరుతో టిడిపి యాప్ పై భయంకరమైన కుట్రలు చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తెలంగాణలో నిరసనలు వద్దని చెప్పారు కేటీఆర్. ఆ సమయంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇప్పటికీ గుర్తు. అయినా సరే అదే కేటీఆర్ విషయంలో లోకేష్( Nara Lokesh) మాత్రం భిన్నంగా స్పందించారు. చాలా హుందాగా వ్యవహరించారు.