AP Elections 2024: కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఐదుగురు నేతలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో వారు గెలవకూడదు అని గట్టి ప్రయత్నం చేస్తోంది. బలమైన వ్యూహరచనతో ముందుకు సాగుతోంది. అయితే వీరిలో నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. గత ఐదేళ్లుగా టిడిపిని దారుణంగా ఇబ్బంది పెట్టారు. అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ శ్రేణులు ఈ ఐదుగురు నేతల తీరుతో ఆపసోపాలు పడ్డారు. అందుకే వీరిని ఓడించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్లు రూపొందించారు. వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ఈ ఐదుగురు నేతలు ప్రజల్లో పట్టున్న వారే కావడం గమనార్హం.విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్, గన్నవరం నుంచి బరిలో దిగిన వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని, విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేశినేని నానిలను ఓడించేందుకు చంద్రబాబు బలమైన అభ్యర్థులను బరిలో దించారు.
గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ టిడిపి అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేశారు. కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. కొద్దిరోజులకే వైసీపీలో చేరారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అనుమానం. ప్రస్తుతం విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న ఆయనపై సిటింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో రామ్మోహన్ గెలుపొందారు. కచ్చితంగా దేవినేని అవినాష్ ను ఓడించి హ్యాట్రిక్ కొడతారని టిడిపి భావిస్తోంది.
గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ మోహన్ ను ఎలాగైనా ఓడించాలని టిడిపి భావిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ మోహన్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు, లోకేష్ లను లక్ష్యంగా చేసుకొని తీవ్ర దూషణలకు పాల్పడ్డారు. చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నాయి. గన్నవరంలో టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేయించడం, టిడిపి శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు వంటివి చేయడంతో వల్లభనేని వంశీ పై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి రప్పించి టికెట్ కేటాయించారు. దీంతో ఇక్కడ గట్టి ఫైట్ ఉంది.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబుతో పాటు లోకేష్లను టార్గెట్ చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. వారిపై విమర్శలతోనే కొడాలి నాని పాపులర్ అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల నాటికి వైసిపిలో చేరిపోయారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఎన్నారై వెనిగండ్ల రామును ఆయనపై ప్రయోగించారు. రాము చాలాకాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పైగా ఆర్థికంగా బలమైన నేత. దీంతో ఇక్కడ గట్టి ఫైట్ ఉంది.
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేశినేని నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నాని గెలుపొందుతూ వచ్చారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గెలిచిన తర్వాత స్వరం మార్చారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేతతో పాటు లోకేష్ ల తీరును తప్పుపట్టేవారు. దీంతో చంద్రబాబు ఆయనకు టికెట్ నిరాకరించారు. దీంతో వైసిపి లోకి వెళ్లి విజయవాడ పార్లమెంట్ స్థానం టికెట్ను నాని పొందగలిగారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది తన విజయం అంటూ చెప్పుకొచ్చిన నానిని.. విజయవాడలో ఓడించి బుద్ధి చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మంత్రి జోగి రమేష్ ను సైతం ఓడించాలని టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి కార్యాలయం పై కార్లతో దండయాత్రకు దిగిన రమేష్ ను విడిచిపెట్టకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పెనమలూరు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన బోడె ప్రసాద్ ను చంద్రబాబు రంగంలోకి దించారు. ప్రస్తుతం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. అత్యధిక మెజారిటీతో టిడిపి అభ్యర్థిని గెలిపించడం ద్వారా జోగి రమేష్ కు చెక్ చెప్పాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అది కొంతవరకు వర్కౌట్ అయ్యేలా ఉంది. అయితే కృష్ణా జిల్లాలో ఈ ఐదుగురు నేతలను ఓడించడం ద్వారా కసి తీర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Telugu desam party has specially focused on five leaders from krishna district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com