Telangana ministers : తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ( Congress Party) చెందిన మంత్రులు జనసేన కార్యాలయంలో కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు హల్ చల్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి జనసేన కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున ఏపీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ వీరికి స్వాగతం పలికారు. సెలవుతో సత్కరించి స్వాగతం పలికారు. కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలను అందజేశారు.
* నీటి వివాదం నేపథ్యంలో
అయితే తెలంగాణ మంత్రులు ఉన్నఫలంగా జనసేన( janasena ) కార్యాలయంలో ప్రత్యక్షం కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. రాజకీయపరంగా విరుద్ధ ప్రభుత్వాలే అయినా.. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాల పాలకులు ఒకరి పట్ల ఒకరు సానుకూలంగా ఉన్నారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు వివాదం నడుస్తోంది. గోదావరి మిగులు జలాలకు సంబంధించి వినియోగిస్తూ బనకచర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. దీనిపై తెలంగాణ నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిన్నపాటి వివాదాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన మంత్రులు జనసేన కార్యాలయానికి రావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు జనసేన కార్యాలయ ప్రాంగణంలో కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.
* ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు..
అయితే తెలంగాణకు చెందిన మంత్రులు రావడం వెనుక రాజకీయ కారణాలేవీ లేవు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో( private program) పాల్గొనేందుకు వెళ్తూ.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం హెలిప్యాడ్ వాడుకున్నట్లు తెలిసింది. మీరు ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ జనసేన నేతలతో కలిసి తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాంగణానికి విచ్చేసిన తెలంగాణ మంత్రులకు శ్రీ @PawanKalyan గారు పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహూకరించి వీడ్కోలు పలికారు. శ్రీ @Bhatti_Mallu గారితోపాటు మంత్రులు శ్రీ @UttamINC గారు, శ్రీ @KomatireddyKVR గారు, శ్రీ వాకిటి శ్రీహరి… pic.twitter.com/G7K3rrsw4P
— JanaSena Party (@JanaSenaParty) August 10, 2025