Telangana Media Controversy: తెలంగాణలో( Telangana) మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి జరిగింది. ఈ దాడిని ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫోన్ టాపింగ్ విషయంలో అసత్య కథనాలు ప్రచురించారని ఆగ్రహంతో బిఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ దాడిని ఖండించారు. అదే సమయంలో అసత్య ప్రచారాలను ప్రసారం చేస్తున్న మీడియా తీరుపై కూడా ఆయన ఆక్షేపించారు. మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి పరోక్ష ప్రస్తావన తీసుకొస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకరికి మిత్రుడు, మరొకరికి శత్రువు
తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న పరిణామాలు భిన్న పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ఏపీలో సీఎం గా చంద్రబాబు ఉన్నారు. టిడిపి కూటమి తరుపున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే టిడిపి కూటమి ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి సంబంధాలే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్న మీడియా తెలంగాణలో రేవంత్ సర్కార్ కు అనుకూలంగా పనిచేస్తోంది. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న మీడియా.. తెలంగాణలో కెసిఆర్ ను వ్యతిరేకిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి, కెసిఆర్ కి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. అదే సమయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు ఉమ్మడి శత్రువు కేసీఆర్. అందుకే ఈ తరహా రాజకీయ ఆట ఉమ్మడి రాష్ట్రాల్లో ఏర్పడింది. మున్ముందు ఈ పరిణామాలు మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది.
Also Read: స్వేచ్ఛకు, పూర్ణచందర్ రావు కు విభేదాలు మొదలైంది అక్కడే..
కెసిఆర్, జగన్ సేమ్ సీన్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని( Telugu Desam Party) నామరూపాలు లేకుండా చేశారు కెసిఆర్. కనీసం తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేశారు. పునాదులతో పెకిలించాలని భావించారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు అదే కేసీఆర్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే క్రమంలో చంద్రబాబు తెలంగాణలో సైతం తన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలుఆర్కే కొత్త పలుకు: అధికారం కోసం రేవంత్ అప్పులు..సీఎం పోస్టు నుంచి తప్పించేలా కాంగ్రెస్ అధిష్టానం ఎత్తులు! ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఫోన్ టాపింగ్ షాక్ తో తమ నాయకుడు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. టిడిపి అనుకూల మీడియా డిబేట్లు నిర్వహిస్తోందని… కథనాలు ప్రసారం చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణుల ఆరోపణ. మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అవగాహనతో చాలా రకాల పరిణామాలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం వారు గట్టి ప్రయత్నమే చేసే అవకాశం ఉంది.