Pawan Kalyan And Chiranjeevi: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నాడు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం…ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఆయనను బీట్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి స్టార్ హీరో ఒకప్పుడు తనతోపాటు తన తమ్ముడిని కూడా హీరోగా చేయాలని అనుకొని పవన్ కళ్యాణ్ ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. ఇక ఇవివి సత్యనారాయణ గారితో ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో పవన్ కళ్యాణ్ కొంతవరకు నిరాశ చెందాడు…ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఇవివి గారికి, ప్రొడ్యూసర్స్ కి సైతం సారీ కూడా చెప్పాడట. కారణం ఏంటి అంటే చిరంజీవి తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పిస్తున్న క్రమంలో ఈ సినిమాకి భారీ హైప్ ని క్రియేట్ చేసే విధంగా చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదొక్కటే మైనస్ అయిందా..?
ఇక దాంతోపాటుగా అక్కినేని నాగేశ్వరరావు గారి మనువరాలు అయిన సుప్రియ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని మెగాస్టార్ తమ్ముడు హీరోగా చేస్తున్నాడంటూ భారీ హోడింగ్స్ పెట్టి విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేయడం సినిమా మీద భారీ హైప్ ను అయితే క్రియేట్ చేసింది. ఇక దాంతో ఈ సినిమా బాగున్నప్పటికి వాళ్ళ అంచనాలను రీచ్ అవ్వకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.
దాంతో దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ అయితే సారీ చెప్పారట. ఒకరకంగా ఈ హైప్ ను క్రియేట్ చేయడానికి చిరంజీవి కారణమని చాలా మంది చెబుతుంటారు. చిరంజీవి తమ్ముడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే మామూలుగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఆయన భారీ ప్రమోషన్స్ అయితే చేయించాడు…
చిరంజీవి చేసిన పనికి పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సి వచ్చిందంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇటు హీరోగా, అటు రాజకీయ నాయకుడిగా పలు రకాల బాధ్యతలను పోషిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…