TDP Win ZPTC ByElection: పులివెందుల( pulivendula).. ఈ మాట చెబితే గుర్తుకొచ్చేది యెలుగంటి సందింటి అలియాస్ వైయస్ ఫ్యామిలీ. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ముందుకు వచ్చిన తరుణం నుంచి ఆ కుటుంబానికి పెట్టని కోటగా మారిపోయింది పులివెందుల. కడప జిల్లాను సైతం తన కనుచూపుతో శాసించగలిగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. సుమారు ఐదు దశాబ్దాల పాటు పట్టు కొనసాగిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసిపి కి ఓటమి రూపంలో ప్రమాదం ఎదురైంది. ఇప్పుడు ఈ జడ్పిటిసి ఉప ఎన్నికతో కంచుకోటకు బీటలు వారినట్లు కనిపిస్తున్నాయి. అంతులేని విజయం నుంచి ఓటమి ఎదురు కావడంతో.. వైయస్ కుటుంబ హవా తగ్గినట్లు స్పష్టం అవుతోంది. రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి ఓ సాధారణ నేత. సాధారణ వ్యాపారి కూడా. కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం. అయితే తన కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని డాక్టర్ గా చేయించి.. పేదల వైద్యుడిగా మార్చాలన్నది రాజారెడ్డి ప్రణాళిక. తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి. వైద్యుడిగా ఆ ప్రాంతానికి విశేష సేవలు అందించారు. ఆ క్రమంలోనే 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది మొదలు ఆ కుటుంబం చేతిలోనే ఉంది పులివెందుల నియోజకవర్గం. సాధారణ,సార్వత్రిక, స్థానిక ఇలా ఏ ఎన్నికల్లోనూ వారిదే హవా. స్థానిక సంస్థల గురించి చెప్పనవసరం లేదు. వారు నిలబెట్టిన నేత ఏకగ్రీవం అయినట్టే. అటువంటి చోటా గట్టిగానే సవాల్ విసిరింది తెలుగుదేశం పార్టీ. కంచుకోటను కొల్లగొట్టే పనిలో పడింది.
ALso Read: పులివెందులలో వైసిపి గల్లంతు.. ఇక కష్టమే!
తొలిసారిగా ఎన్నికలు
పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం( simhadripuram), లింగాల, తొండూరు, పులివెందుల, వేంపల్లె, చక్రాయపేట మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు సంబంధించి స్థానిక సంస్థలు ఎన్నికలను ప్రజలు చూడడం చాలా తక్కువ. ఓట్లు వేయడం కూడా చాలా అరుదు. అటువంటి చోట తొలిసారిగా ఎన్నికలు జరగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు. అయితే అధికార పార్టీ దుర్వినియోగం చేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని అధికారపక్షం చెబుతోంది. అయితే మొత్తానికి పులివెందులలో వైయస్సార్ కుటుంబ హవాను చెక్ చెప్పేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకుంది తెలుగుదేశం పార్టీ.
Also Read: పులివెందులలో రెండో స్థానంలో కాంగ్రెస్.. వైసీపీ లెక్క అదే!
చేజారిన ‘స్థానిక’ పట్టు
1978లో తొలిసారిగా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ). అప్పటినుంచి ఆ నియోజకవర్గ పరిధిలో ఏ ఎన్నిక జరిగినా అది వారి చేతిలోనే ఉండేది. స్థానిక సంస్థలు సైతం ఏకగ్రీవం అయ్యేవి. వారి సూచించిన వ్యక్తి ఏకగ్రీవం అయ్యేవారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. 1985, 1994, 1999, 2014.. ఇలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పులివెందుల నియోజకవర్గం. అటువంటిది 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి పట్టు బిగించాలని చూసింది తెలుగుదేశం పార్టీ. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని జడ్పిటిసి ఉప ఎన్నికలను సద్వినియోగం చేసుకుంది. ఒక ప్రణాళిక ప్రకారం, ఎటువంటి హడావిడి లేకుండా స్థానిక నాయకత్వంతోనే తతంగాన్ని నడిపించింది. బయట జిల్లాల నేతల ప్రమేయం కూడా లేకుండా.. కేవలం కడప జిల్లా నాయకత్వంతో, మూడు పార్టీల సమన్వయంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఐదు దశాబ్దాల వైయస్ కుటుంబ చరిత్రను ఇబ్బందుల్లో పెట్టింది. తగ్గించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది.