TDP Party : తెలుగుదేశం( Telugu Desam) పార్టీ సోషల్ మీడియా చాలా దూకుడుగా ఉంది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతోంది. అయితే ఈ క్రమంలో కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలను సైతం సోషల్ మీడియా విభాగం టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు టార్గెట్ అయ్యారు. ఇంతకీ ఆయన చేసిన తప్పిదం ఏంటంటే.. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ప్రధానిని కల్పించడమే. కొద్ది రోజుల కిందట నాగార్జున కుటుంబంతో పాటు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు. అందుకే టిడిపి సోషల్ మీడియా లావు శ్రీకృష్ణదేవరాయలను టార్గెట్ చేసుకుంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు.
* టిడిపికి వ్యతిరేక ముద్ర
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) సన్నిహితుడు. ఇటీవల ఆయన తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసింది. అయితే నాగార్జున ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో.. తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. మరోవైపు తెలంగాణలో కెసిఆర్ సన్నిహితుడు కావడంతోనే రేవంత్ ఈ చర్యకు దిగారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ప్రధాని మోదీని కల్పించడం ఏంటన్నది టిడిపి సోషల్ మీడియా ప్రశ్నిస్తున్న మాట. ఈ విషయంలో టిడిపి సోషల్ మీడియాకు ఆగ్రహం రావడంతోనే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టినట్లు సమాచారం.
* జగన్ కు సన్నిహితులు
మరోవైపు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్( yarla gadda Lakshmi Prasad) . ఈయన సైతం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని నిత్యం వ్యతిరేకిస్తుంటారు. వైసిపి హయాంలో నామినేటెడ్ పదవి సైతం దక్కించుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి అయిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను ప్రధాని మోదీని కల్పించడం ఏంటనేది టిడిపి సోషల్ మీడియా ప్రశ్న. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, ఇతరత్రా విషయాల్లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ భిన్నంగా స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవాలని ఆకాంక్షించారు. అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ప్రధాని మోదీతో కల్పిస్తారా? అంటూ టిడిపి శ్రేణులు కూడా లావు శ్రీకృష్ణదేవరాయలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
* వరుసగా ఘటనలు
అయితే సొంత పార్టీ నేతలపైనే టిడిపి సోషల్ మీడియా( TDP social media) విరుచుకుపడుతుండడం విశేషం. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ తో వేదిక పంచుకున్నారని మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌత శిరీషపై టిడిపి సోషల్ మీడియా విరుచుకుపడింది. ఇటీవల ప్రముఖ గాయని మంగ్లీని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి తీసుకెళ్లారన్న ఆగ్రహంతో రామ్మోహన్ నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది టిడిపి సోషల్ మీడియా. ఈ రెండు ఘటనలు మరువక ముందే ఏకంగా టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతపై వ్యతిరేక ప్రచారం చేయడం విశేషం.