TDP MLA Surya Prakash: టిడిపికి ( Telugu Desam Party) చెందిన సీనియర్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెబుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అందుకే మహానాడుకు దూరంగా ఉన్నారా? అసెంబ్లీ సమావేశాలకు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అంతటా అదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ నేత ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై పూర్తి స్పష్టతనిచ్చారు. దీంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగింది.
కోట్ల కుటుంబానిది ప్రత్యేక స్థానం
ఏపీ రాజకీయాల్లో కోట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి( Kotla vijayabaskar Reddy ). ఆయన వారసుడిగా తెరపైకి వచ్చారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ఆయన మాదిరిగా రాష్ట్ర నాయకుడు కాలేకపోయారు కానీ.. మూడుసార్లు కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది కోట్ల కుటుంబం. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యేగా ఆయన భార్య కోట్ల సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. భర్త ఎంపీగా, భార్య ఎమ్మెల్యేగా పోటీ చేసి మరోసారి ఓటమిచ్చావి చూశారు. 2024 ఎన్నికల్లో అలానే పోటీ చేయాలని భావించారు. కానీ కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ అని చెప్పడంతో డోన్ నుంచి సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై గెలవడంతో సూర్య ప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ వివిధ సమీకరణలో ఆయనకు చాన్స్ దక్కలేదు.
Also Read: వైసీపీకి ఆ రెండు కులాలు దూరం.. జగన్ లో కలవరం!
అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం..
అయితే గత కొంతకాలంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి( Surya Prakash Reddy) అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. ఈ క్రమంలో కడప జిల్లాలో జరిగిన మహానాడుకు ఆయన హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం గైరహాజరవుతున్నారు. టిడిపి హై కమాండ్ పై సూర్యప్రకాశ్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో సూర్య ప్రకాశ్ రెడ్డి స్పందించారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపిని వీడే ప్రసక్తి లేదని.. మంత్రి పదవి రాలేదని తనలో అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో..
గత కొంతకాలంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిమోనియాతో( nimonia) బాధపడుతున్న ఆయన కాలికి ఇటీవల సర్జరీ జరిగింది. కోలుకునేందుకు సమయం పట్టింది. అందుకే ఆయన మహానాడుకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి, సీఎం చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొస్తున్నారు సూర్య ప్రకాశ్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఒకసారి కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చానని.. మరో పార్టీలో చేరే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.