TDP MLA Midnight Controversy: తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు. పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వారు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. అర్ధరాత్రి పూట ఆ ఎమ్మెల్యే చేసిన హల్చల్ అంతా కాదు. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు సముదాయించడంతో చల్లబడ్డారు.
* వివాదాస్పద ముద్ర
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పై వివాదాస్పద ముద్ర ఉంది. గతంలో ఓ మహిళ అధికారిపై ఆయన చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే ఈసారి సొంత పార్టీ నేతపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి తన అనుచరులతో సొంత పార్టీ కి చెందిన ఓ లాయర్ ఇంటిపై దూసుకు వెళ్లారు. అక్కడ నానా బీభత్సం సృష్టించారు. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచరులతో తన సొంత పార్టీ నేత ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. చంపేస్తా అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు.
* ఘటనా స్థలానికి ఎమ్మెల్యే కుమార్తె..
మరోవైపు ఎమ్మెల్యేను శాంతి పరిచేందుకు కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కుమార్తె ఘటనా స్థలానికి చేరుకున్నారు. వద్దు నాన్న ప్లీజ్.. వెళ్లిపోదాం అంటూ కుమార్తె రిక్వెస్ట్ చేశారు. నన్ను ఆపుతావు ఏంటి అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న డీఎస్పీతో సైతం వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్లు అయింది. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే పై వివాదాలు రావడంతో అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలే పంపారు. ఒకటి రెండుసార్లు గట్టిగానే సముదాయించారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి.
తెలుగు దేశం లో పెరుగుతున్న అంతర్గత దాడులు.
ఏలూరులో శ్రీనివాస్ అనే మరో టీడీపీ నాయకుడి
ఇంటిపై దాడికి వెళ్లి రౌడీలా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.#eluru #tdp #chintamaneniprabhakar #UANow pic.twitter.com/2VTFFUu3gb— UttarandhraNow (@UttarandhraNow) June 15, 2026
