TDP Mahanadu : తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) నిజమైన పండుగ మహానాడు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ప్రతి సంవత్సరం మహానాడు ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా మహానాడు నిర్వహిస్తుంటారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఏ పార్టీ చేయని విధంగా మహానాడు ను జరుపుతుంటారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మహానాడు ను నిర్వహించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది కడపలో మహానాడు ను నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
Also Read : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!
* కడప జిల్లాలో ఈసారి..
అయితే ఈసారి వ్యూహాత్మకంగా మహానాడు( mahanadu ) నిర్వహణకు కడప జిల్లాను ఎంపిక చేయడం విశేషం. 2024 ఎన్నికల్లో గెలుపుతో దూకుడు మీద ఉంది తెలుగుదేశం. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా నడిచే కడపలో మహానాడు అంటే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాయి టిడిపి శ్రేణులు. మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలంతా హాజరవుతారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పప్పాపురం గ్రామాల పరిధిలో మహానాడు ను నిర్వహిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేసవి కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడిన తడవకుండా ఉండేందుకు సైతం ఏర్పాట్లు చేశారు.
* 22 వంటకాలతో మెనూ..
సాధారణంగా మహానాడు అంటే పసందైన వంటకాలు ఉండాల్సిందే. ఈ ఏడాది కూడా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పసందైన వంటకాలు ఉంటాయని సోషల్ మీడియాలో( social media) ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం మినీ మహానాడు భోజనాల మెనూ అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. టిడిపి శ్రేణులను తెగ ఆకట్టుకుంటుంది. అయితే సాధారణంగానే మహానాడు అంటే చాలా రకాల వంటకాలు ఉంటాయి. ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటారు. మహానాడుకు హాజరయ్యే టిడిపి శ్రేణులు సంతృప్తిగా భోజనాలు చేసి తిరుగు ముఖం పడతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అంతలా ఉంటాయి అక్కడ భోజనం ఏర్పాట్లు.
* వెజ్, నాన్ వెజ్ వంటకాలతో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మినీ మహానాడు భోజనాల మెనూ ప్రకారం.. అల్పాహారం( tiffins ) కింద ఇడ్లీ, వడ, పొంగల్, చట్నీ, సాంబారు, కారంపొడి, నెయ్యి, టి అందిస్తారు. మధ్యాహ్నం భోజనం కింద కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జి, టమాటా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతీ, సొరకాయ పప్పు, చట్నీ, కారంపొడి, తెల్ల అన్నం, టమోటా కాజు ములక్కాయ, గుత్తి వంకాయ మసాలా కర్రీలు అందిస్తారు. వీటితో పాటు నాన్ వెజ్ కర్రీలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, ఐస్ క్రీమ్, కేక్, కూల్ డ్రింక్స్ ఇలా మొత్తం 22 రకాల ఐటమ్స్ తో.. మహానాడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు టిడిపి జర్మనీ విభాగం పోస్ట్ చేసినట్లు ఈ ఫోటో వైరల్ అవుతోంది. కానీ దీనిని టిడిపి నాయకత్వం ధ్రువీకరించలేదు.