TDP Mahanadu : కడప( Kadapa ) జిల్లాలో మహానాడు కొనసాగుతోంది. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా టిడిపి జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు ఎన్నికయ్యారు. నిన్న ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు కూడా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ఈసారి వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఉండేది. టిడిపి ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో సానుభూతి వ్యక్తం అయింది. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో దోహదపడింది. కానీ గత ఐదేళ్లుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన పరిణామాలు… 2024 ఎన్నికల్లో ప్రభావం చూపాయి. ఎన్నికల్లో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి వివేక హత్య అంశం ఒక కారణం. అందుకే ఇప్పుడు చంద్రబాబు కడప మహానాడు వేదికగా మరోసారి వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని తెరపైకి తెచ్చారు.
Also Read : మహానాడు వేళ.. ఎన్టీఆర్, చంద్రబాబుపై ప్రధాని సంచలన కామెంట్స్
* వివేకానంద రెడ్డి హత్యతో మోసం..
వివేకానంద రెడ్డిని( Y S Vivekananda Reddy ) నాడు దారుణంగా హత్య చేశారని.. గుండెపోటుగా నమ్మించారని గుర్తు చేశారు చంద్రబాబు. అది సాధ్యం కాకపోయేసరికి చంద్రబాబు హత్య చేయించారని.. నారా సుర రక్త చరిత్ర అంటూ తన చేతిలోనే కత్తి పెట్టి సాక్షి మీడియాలో ప్రచారం చేసుకున్న వైనాన్ని ప్రస్తావించారు. సొంత బాబాయిని హత్య చేయించి.. రక్తపు మరకలు తుడిచేసి.. ప్రజల్లో అబద్ధాన్ని నిజం చేసి ప్రచారం చేశారని.. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఐదేళ్లుగా వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన పరిణామాలను ప్రజలు గుర్తించారని.. అందుకే సరైన బుద్ధి చెప్పారని చంద్రబాబు అన్నారు. మరోసారి అటువంటి కుట్రలు చేసే అవకాశం ఉన్నందున టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
* తమ్ముళ్లు జాగ్రత్త..
మరోవైపు చంద్రబాబు( CM Chandrababu) పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి టిడిపిలోకి కోవర్టులను పంపుతున్నారని.. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే అటువంటి వలస పక్షుల కు అజెండా సాధ్యం కాదని.. అటువంటివారు వస్తుంటారు పోతుంటారు.. కానీ నిజమైన టిడిపి కార్యకర్త శాశ్వతం అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజల మెచ్చే రాజకీయ పాలన గురించి చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీకి అద్భుత విజయాలు వస్తున్నాయని.. మంచి మెజారిటీలు వస్తున్నాయని.. అటువంటి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్మాద రాజకీయం జరుగుతోందని.. గరుడుగట్టిన నేరస్తులతో మనం రాజకీయం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొవ్వొత్తులను పంపి మన వేలుతో మన కన్నునే పొడుచుకునేలా చేయాలనుకుంటున్నారని కోవర్టు రాజకీయాల గురించి కఠినంగానే హెచ్చరికలు పంపారు చంద్రబాబు.
వివేకా హత్యపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మహానాడు కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘‘గుండెపోటుతో వివేకా చనిపోయారని వార్తలు వచ్చినప్పుడు నేనూ నమ్మాను. గొడ్డలితో దారుణంగా చంపేసి.. రక్తాన్ని కడిగేసి ఏమీ జరగనట్లు గుండెపోటు అని… pic.twitter.com/W5C1lH7Mrl
— ChotaNews App (@ChotaNewsApp) May 28, 2025