Homeఆంధ్రప్రదేశ్‌TDP Leader Joins YSR Congress 2025: టిడిపి కి షాక్.. తాడేపల్లి ప్యాలెస్ కు...

TDP Leader Joins YSR Congress 2025: టిడిపి కి షాక్.. తాడేపల్లి ప్యాలెస్ కు సీనియర్ నేత!

TDP Leader Joins YSR Congress 2025: తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఓ నేత ఇప్పుడు గుడ్ బై చెప్పడం చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు నిర్ణయించారు. పార్టీ శ్రేణులతో భారీ సమావేశం నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్లతోపాటు పార్టీ ప్రముఖులంతా హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పై ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఉన్నఫలంగా టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ కార్యాలయం వద్దకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

మొన్న ఎన్నికల్లో ఓటమి..
మొన్నటి ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సుగవాసి సుబ్రహ్మణ్యం. టిడిపి కూటమి ప్రభంజనం సృష్టించిన ఈ సమయంలో సుబ్రహ్మణ్యం ఓడిపోయారు. అయితే ఓటమినాటి నుంచి సుబ్రహ్మణ్యం పరిస్థితి తీసికట్టుగా మారుతోంది. ఆయన నియోజకవర్గంలో మిగతా నేతలను కలుపుకొని వెళ్లడం లేదన్న టాక్ ఉంది. ఒకటి రెండుసార్లు అధినేత చంద్రబాబు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో ఆయన మనస్థాపానికి గురయ్యారు. మరోవైపు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుండడంతో బయటకు వెళ్లి పోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు టిడిపిలో సుదీర్ఘకాలం పనిచేసిన తన తండ్రి పాలకొండ్రాయుడు మృతిచెందినా చంద్రబాబు స్పందించకపోవడంతో సైతం ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ రావడంతో ఆయన ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  MIM in AP: ఏపీలో మజ్లిస్.. 20 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నష్టమే!

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం..
సుగవాసి సుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ్రాయుడు చంద్రబాబుకు సమకాలీకుడు. 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబుతో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తరువాత 1983లో పాలకొండ్రాయుడు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చారు సుగవాసి సుబ్రహ్మణ్యం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఆయనను పిలిచి టిక్కెట్ ఇచ్చారు. కానీ ఓటమి చవి చూశారు. మరోవైపు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గ పోరు అధికం అయింది. సుబ్రహ్మణ్యం కు ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలని ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు.

జగన్ భారీ హామీ..
వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాయచోటి అసెంబ్లీ టికెట్ హామీ కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. కానీ చివరకు రాజంపేట పార్లమెంట్ టికెట్ హామీ దక్కినట్లు తెలుస్తోంది. అయితే సుగవాసి సుబ్రహ్మణ్యం విషయంలో చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన నిర్లక్ష్యం మూలంగానే రాజంపేటలో ఓటమి ఎదురైందన్న నివేదికలు ఆయన వద్ద ఉన్నాయి. అందుకే ఆయనను పెద్దగా పట్టించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular