TDP : టిడిపిది అదే ధైర్యం

ఈ రెండు వర్గాల నుంచి మెజారిటీ ఓట్లు సాధించామని..టిడిపికి సంప్రదాయ ఓటు బ్యాంకు40%తోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండనే ఉందని.. వీటన్నింటితో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Written By: NARESH, Updated On : May 20, 2024 5:11 pm

TDP Second List

Follow us on

TDP : ఎన్నికల్లో గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. 150 కి పైగా అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు చేజిక్కించుకుంటామని అధికార వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సైతం 120 సీట్లకు పైగా గెలుచుకుంటామని చెప్పుకొస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని..ఆ ఓట్లన్నీ గంప గుత్తిగా పడతాయని అంచనా వేస్తోంది.ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్ల ఓటు తమకేనని, వారి కుటుంబాల ఓట్లు సైతం తమకే పడతాయని, అటుఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల సాయం తమకే దక్కిందనిటిడిపి కూటమి అంచనా వేయడం విశేషం.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లునమోదు కావడం రికార్డ్. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కేవలం లక్షన్నర మాత్రమే నమోదయ్యాయి. ఈసారి వాటి సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఓట్లు కలిపి పది లక్షల వరకు ఉంటాయి. వారి కుటుంబాల ఓట్లు కలిపి 20 నుంచి 25 లక్షల వరకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ గుంప గుత్తిగా తమకే పడతాయని టిడిపి కూటమి పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. ఇంకా ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు 10 వరకు ఓట్లను ప్రభావితం చేసి ఉంటారని.. ఈ లెక్కన 50 లక్షల వరకు ఓట్లు దక్కుతాయని చెబుతున్నారు.

దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వీరంతా కూటమికి మద్దతుగా పనిచేసి ఉంటారని.. వృద్ధులు, నిరక్షరాస్యులు ఓటు వేసే క్రమంలో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించి ఉంటారన్నది టిడిపి విశ్లేషణ. ఈ రెండు వర్గాల నుంచి మెజారిటీ ఓట్లు సాధించామని..టిడిపికి సంప్రదాయ ఓటు బ్యాంకు40%తోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండనే ఉందని.. వీటన్నింటితో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.