TDP : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడు కొనసాగుతోంది. కడపలో నిన్ననే మహానాడు ప్రారంభం అయింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. దీంతో మహానాడు ప్రాంగణం పసుపు మయంగా మారింది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. యువనేత లోకేష్ ఆరు శాసనాలను ప్రవేశపెట్టారు. మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీ ఉనికి చాటుకునేలా కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు తొలిరోజే పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయి. మొత్తం రూ. 21.53 కోట్ల విరాళాలు వచ్చినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మహానాడు జరిగినప్పుడు పార్టీ ప్రతినిధులు విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన టిడిపి దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలో నేతలు పార్టీకి భారీగా విరాళాలు ప్రకటించడం విశేషం. అయితే విరాళాలు అందించడంలో నెల్లూరు ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందున్నారు. ఆయన ఏకంగా ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమకు తోచినంతగా విరాళాలు అందిస్తున్నారు. పార్టీ కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం ఈ విరాళాలను ఖర్చు పెడతామని అధినేత చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు పార్టీ నియమావళిలో మార్పులు చేయాలని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అధినేతను కోరారు.
* మహానాడు వేదికపై పేర్ల ప్రకటన..
టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu) విరాళాల కోసం ప్రత్యేక ప్రకటన చేశారు. ఆన్లైన్లో సైతం విరాళాలు పంపవచ్చని సూచించారు. ఆర్థికంగా బలమైన వారు మాత్రమే తమ శక్తి మేర పార్టీకి విరాళాలు ఇవ్వాలని కోరారు అధినేత చంద్రబాబు. దీంతో టీడీపీ నేతలు స్పందించారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను చంద్రబాబు మహానాడు వేదికపై ప్రకటించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు కోట్లు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోటి యాభై లక్షలు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కోటి 16 లక్షలు విరాళంగా ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ 25 లక్షలు అందించారు. మరోవైపు మంత్రులు పి.నారాయణ , టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర ఒక్కొక్కరు కోటి రూపాయల చొప్పున విరాళం అందజేశారు. మంత్రులు సవిత 50 లక్షలు, కొండపల్లి శ్రీనివాస్ 40 లక్షలు ఇచ్చారు. టిడిపి నేతలు భాష్యం రామకృష్ణ కోటి, గంగ ప్రసాద్ 50 లక్షలు విరాళాలుగా అందజేశారు. ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున రాజగోపాల్ 50 లక్షలు విరాళంగా అందజేశారు.
Also Read : పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్నాడు.. చంద్రబాబు చెప్పిన చంద్రయ్య కథ
* ఎమ్మెల్యేలు సైతం
మరోవైపు ఎమ్మెల్యేలు సైతం స్పందించారు. తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, దామచర్ల జనార్ధన్ చిరు 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ 15 లక్షలు, పులివర్తి నాని 10 లక్షలు విరాళం అందించారు. మామిడి గోవిందరావు, బొజ్జల సుధీర్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వేగేస్న నరేంద్ర వర్మ చెరువు పది లక్షల రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. గద్దె రామ్మోహన్ రావు రెండు లక్షలు, యనమల దివ్య లక్ష విరాళం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పది లక్షలు, వేమన సతీష్ 25 లక్షలు, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ 25 లక్షలు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర 25 లక్షలు విరాళం ఇచ్చారు. అడుసు మల్లి రాధాకృష్ణ 13 లక్షలు, డేగల ప్రభాకర్ రావు 10 లక్షలు, కంది చంద్రశేఖర్ ఐదు లక్షలు, బాజీ చౌదరి ఐదు లక్షలు, గోవిందరెడ్డి ఐదు లక్షలు, గద్దె అనురాధ రెండు లక్షలు, గద్దె పద్మావతి 2 లక్షలు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు లక్ష రూపాయలు, మల్లెల రాజశేఖర్ విరాళం ఇచ్చారు.
* ఆన్లైన్లో సైతం విరాళాలు..
మరోవైపు ఎన్నారై విభాగం సభ్యులు కూడా పార్టీకి విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో సైతం విరాళాలు అందించవచ్చు అని చెప్పారు. పార్టీకి వచ్చిన విరాళాలను కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రకటించారు. మొత్తానికైతే కడప మహానాడు వేదికగా భారీగా విరాళాలు రావడం విశేషం. మరోవైపు పార్టీ నియమావళిలో మార్పులు తేవాలని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అధినేత చంద్రబాబును విజ్ఞప్తి చేశారు.