TDP First List: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. అధికార వైసీపీ దూకుడు మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. ఇప్పటివరకు నాలుగు జాబితాలను ప్రకటించి 60 మంది సిట్టింగులను తప్పించింది. మరో 20 మందిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది. అయితే విపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి ఇంతవరకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు కూటమిలోకి బిజెపి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
అయితే తెలుగుదేశం పార్టీ జాబితా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై టిడిపి నుంచి ఎటువంటి ధృవీకరణ లేకున్నా.. కీలక నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ ఓ జాబితా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇచ్చాపురం నుంచి డాక్టర్ బెందాళం అశోక్, పలాస గౌతు శిరీష, టెక్కలి అచ్చెనాయుడు, ఆమదాలవలస కూన రవికుమార్, రాజాం కోండ్రు మురళీమోహన్, విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, బొబ్బిలి బేబీ నాయన, కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయ్ చంద్ర, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమ గణబాబు, నర్సీపట్నం చింతకాయల విజయ్, పాయకరావుపేట వంగలపూడి అనిత, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం దత్తాల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు కొలుసు పార్థసారథి, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు పేర్లు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇంకా సీట్ల సర్దుబాటు తేలకముందే టిడిపి అభ్యర్థులను ప్రకటిస్తుండడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ జాబితాలో జనసేన ఆశిస్తున్న స్థానాలు సైతం ఉన్నాయి. దీంతో దీనికి కౌంటర్ గా జనసేన శ్రేణులు తమ పార్టీ అభ్యర్థులు బరిలో దిగే నియోజకవర్గాలు ఇవి అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న ఈ జాబితా విషయంలో టిడిపి ఎటువంటి ధ్రువీకరణ చేయకపోవడం విశేషం.