https://oktelugu.com/

Swetha Chowdary Alias Swathi Reddy : స్వాతిరెడ్డినా? స్వాతి చౌదరినా? అసలు ఎవరీమె.. ఎందుకీ వివాదం?

లోకేష్ ఆమెకు బ్యాక్ బోన్ గా ఉన్నారన్నది వైసీపీ వాదన. ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా దీనిని బయట పెట్టిందో అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. 

Written By: , Updated On : June 30, 2023 / 07:22 PM IST
Follow us on

Swetha Chowdary Alias Swathi Reddy : పొలిటికల్ పార్టీలు ఆడుతున్న గేమ్ లో పుట్టుకొస్తున్న వారు సోషల్ మీడియా స్టార్లు. వారికి పెంచి పోషిస్తుండడంతో పెట్రేగిపోతున్నారు. అయితే వారి చేసే అతిని వెనుకేసుకొస్తుండడంతో నేతలు సైతం నవ్వులపాలవుతున్నారు. ఇటీవల స్వాతిరెడ్డి అనే యువతి తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో ఏడుపులు, పెడబొబ్బులు పెట్టుకుంది. వైసీపీ సోషల్ మీడియా తనను మానసికంగా వేధిస్తోందని చెప్పుకొచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండడంతో తనను వెంటాడుతోందని బోరున విలపించింది. పనిలో పనిగా సీఎం జగన్ తో పాటు సతీమణి భారతిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది.

అయితే సీన్ కట్ చేస్తే అసలు ఆమె స్వాతిరెడ్డి కాదని.. స్వాతి చౌదరి అని వైసీపీ సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆమె వెనుక నారా లోకేష్ ఉన్నారని ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా ఆమె అదర చుంభనాలు, వేరే యువకుడితో సన్నిహితంగా ఉన్న చిత్రాలు సైతం బయటకు వచ్చాయి. ఆమె ఓ పో..స్టార్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎల్లో మీడియా ఒకటి ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆమె కులం, ఆమె చేస్తున్న ఉద్యోగం, ఆమె వెనుక లోకేష్ ఉన్నట్టు జరుగుతున్న ఆరోపణలు, కొన్నిరకాల అనుమానాలను ప్రస్తావిస్తూ..వాటిని నివృత్తి చేయాలని ప్రయత్నించింది. అన్నింటికంటే మించి ఆమెను కావాలనే వైసీపీ వేధిస్తోందని చెప్పించేందుకు, చూపించేందుకు సదరు మీడియా చానెల్ తెగ తాపత్రయపడింది.

సదరు చానెల్ ఈ ప్రయత్నం చేసిందో లేదో.. సోషల్ మీడియాలో ఎల్లో లైట్ పార్టులంటూ ప్రత్యక్షమైన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సదరు చానెల్ వ్యాఖ్యాత అడుగుతున్న అంశాలకు.. స్వాతి ఇస్తున్న జవాబులకు మధ్య వీడియోలను జత చేశారు. పెళ్లాం ఊరెళితే సినిమాలో వ్యాంపు క్యారెక్టర్ పాత్రలో ఉండే జ్యోతి చెప్పే సమాధానాలను జత చేశారు. ప్రతి ప్రశ్నకు సింక్ అయ్యే విధంగా వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు వెనుకబడిన వర్గాల యువతి అని చెప్పడం, స్వాతి తన వెనుక చంద్రబాబు, లోకేష్ అన్న ఉన్నారని చెబుతుండడంతో ఈ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. వైసీపీ శ్రేణులు అయితే క్షణాల్లో వైరల్ చేస్తున్నారు.

స్వాతిరెడ్డి గత కొంతకాలంగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా ఉన్నారు. లండన్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో ఆమె నిజంగా రెడ్డియేనా? అలా అయితే ఆమె సొంత సామాజికవర్గానికి చెందిన నాయకుడుపైనే ఎందుకు కామెంట్లు పెడుతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా ఆరాతీసింది. ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. ఆమె అసలు రెడ్డియే కాదని.. చౌదరి అని.. ఆమె వెనుక లోకేష్ ఉన్నారన్నది వైసీపీ అనుమానం. పైగా ఆమె ఉద్యోగం అంటూ చేయలేదని.. లోకేష్ ఆమెకు బ్యాక్ బోన్ గా ఉన్నారన్నది వైసీపీ వాదన. ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా దీనిని బయట పెట్టిందో అప్పటి నుంచి వివాదం నడుస్తోంది.