Supreme Court : వైఎస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. మద్యం స్కామ్ లో ఆయన అరెస్టుకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఏపీ సిఐడి దూకుడుకు కళ్లెం పడింది. ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్టు చేసి.. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించాలని ఏపీ సీఐడీ భావించింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఐడి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే టార్గెట్ గా చేసుకుంటూ అనేక రకాలుగా కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పై లిక్కర్ స్కాం అభియోగాలు మోపింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు సిఐడి విచారణ, మరోవైపు ప్రత్యేక దర్యాప్తు పేరిట హడావిడి చేస్తోంది.
Also Read : చింతమనేని ఇలా మారిపోయారు ఏంటి?
* అధినేతకు విధేయత..
పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. వరుసగా మూడుసార్లు రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు మిధున్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు మిథున్ రెడ్డి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి పై దృష్టి పెట్టింది. ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలని చూసింది. అందుకు మిధున్ రెడ్డి సహకరించకపోవడంతో లిక్కర్ స్కామ్ పేరిట ఆయనపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేసింది. కానీ మిథున్ రెడ్డి నేరుగా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి అరెస్టు నుంచి తప్పించుకునేలా చేసుకున్నారు.
* పట్టు బిగించిన సిఐడి..
కొద్ది నెలల కిందటే ఏపీ ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు( CID enquiry) ఆదేశించింది. ఈ క్రమంలోనే అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డిని ఏపీ సిఐడి అరెస్టు చేసింది. అయితే ఆయన నోటి వెంట మిధున్ రెడ్డి మాట వచ్చింది అంటూ కొత్త అభియోగాలు మోపుతూ మీడియాకు లికులు ఇచ్చింది ఏపీ సిఐడి. దీంతో తనను తప్పకుండా అరెస్టు చేస్తారని భావించారు మిధున్ రెడ్డి. అందుకే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటీషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ కేసులో మిథున్ రెడ్డి పేరు పెట్టలేదని.. ఆ దిశగా చర్యలు లేవని సిఐడి హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు.
* ఢిల్లీలో అరెస్ట్ కు ప్రయత్నం..
ఒకవైపు ఏపీ హైకోర్టుకు( AP High Court) అలా సమాచారం ఇచ్చిన సిఐడి.. నేరుగా ఢిల్లీలో ప్రత్యక్షమైంది. పార్లమెంటు సమావేశాలకు హాజరైన మిధున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీల కదలికపై దృష్టి పెట్టింది సిఐడి. ఎంతలోనే మిధున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టారు. అత్యున్నత న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో సిఐడి కి షాక్ తగిలినట్లు అయింది.
Also Read : వైయస్సార్ కాంగ్రెస్ కు జగన్ ఆత్మీయ నేత గుడ్ బై!