Virat Kohli: టీమిండియాలో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అతడు ఆడుతుంటే మైదానానికి ప్రేక్షకులు తండోపతండాలుగా వస్తుంటారు. అతడు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే వైరల్ చేస్తుంటారు. అందుకే సమకాలీన క్రికెట్లో విరాట్ కోహ్లీని సమ్మోహన రూపుడని వ్యాఖ్యానిస్తుంటారు.
Also Read: ఓహో అశ్విన్ యూ ట్యూబ్ చానెల్ లో CSK మ్యాచ్ ల రివ్యూ.. అందుకే చెప్పడం లేదా..
విరాట్ కోహ్లీ టీమిండియాలో స్టార్ ఆటగాడిగా పేరుపొందాడు. పరుగుల యంత్రంగా వినతి కెక్కాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ కు దగ్గరగా వచ్చాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. బెంగళూరు జుట్టు తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. గత ఐపిఎల్ సీజన్లో అత్యధికంగా పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో అనేక సందర్భాల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ లను సొంతం చేసుకున్నాడు. మైదానం ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు. అదే సమయంలో తనలో ఉన్న కమెడియన్ ను కూడా బయటకి తీస్తాడు. అందువల్లే అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
ఏకంగా ఇంటి మీద పెట్టుకున్నాడు..
విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు అభిమానులైతే అతడి నెత్తిన పెట్టుకుంటారు. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ మీద ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. తాను నిర్మిస్తున్న ఇంటిపైన విరాట్ కోహ్లీ బొమ్మను రూపొందించాడు. దానికి తగ్గట్టుగానే రంగులు కూడా వేశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ కావడం.. అది కాస్త వైరల్ గా మారడంతో.. ఒక్కసారిగా చర్చ మొదలైంది.. విరాట్ కోహ్లీ మీద ఉన్న అభిమానాన్ని తన ఇంటి మీద బొమ్మ రూపంలో చిత్రించి.. చాటుకుంటున్న ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. ఇక ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” విరాట్ అంటే నీకు ఎంత అభిమానం బ్రదర్.. ఏకంగా నీ ఇంటి మీదనే అతడిని చిత్రీకరించుకుంటున్నావ్. నీ అభిమానానికి కొలమానాలు లేవు. విరాట్ మీద ఉన్న నీ ప్రేమకు ఉపోద్ఘాతాలు కూడా లేవు. విరాట్ మీద ఉన్న నీ ఇష్టాన్ని పోల్చాలంటే ఉపమానాలు కూడా సరిపోవు. విరాట్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నప్పటికీ.. నీలా ఎవరూ తమ అభిమానాన్ని చాటుకోలేరు. ఎందుకంటే నువ్వు ఏకంగా నీ ఇంటి పైన విరాట్ కోహ్లీకి స్థానం ఇచ్చావు. అది మామూలు విషయం కాదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఆ ఇంటిపై విరాట్ కోహ్లీ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆ వ్యక్తికి మొదట్లో క్రికెట్ అంటే తెలిసేది కాదు. విరాట్ కోహ్లీ గురించి తన ఊర్లో వాళ్లు చెబుతుంటే విన్న అతడు.. క్రికెట్ చూడటం మొదలుపెట్టాడు.. విరాట్ కోహ్లీపై అభిమానం పెంచుకున్నాడు.
View this post on Instagram