https://oktelugu.com/

Nara Lokesh: ఏపీ డీఎస్సీ 2024.. అసెంబ్లీలో మంత్రి లోకేష్ సంచలన ప్రకటన

ఈనెల మొదటి వారానికి డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. దీంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. ఈ తరుణంలో మంత్రి లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

Written By: Dharma, Updated On : November 15, 2024 5:26 pm
Nara Lokesh(4)

Nara Lokesh(4)

Follow us on

Nara Lokesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంపు పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈనెల తొలి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం సాగింది.కానీ వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణతో పాటు ఇతరత్రా అంశాలతోనే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు ప్రచారం సాగింది.ఈ క్రమంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల,పోస్టుల భర్తీపై మంత్రి లోకేష్ అసెంబ్లీలో పూర్తి స్పష్టత ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 16 వేల 336 పోస్టులకు పెంచుతూ తొలి ఫైల్ పై ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. కానీ డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం వాయిదాలు పడుతూ వస్తోంది. తొలుత టెట్ నిర్వహణ అడ్డంకిగా మారింది. టెట్ తరువాత నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పారు. దీంతో టెట్ పరీక్ష పూర్తయింది. దీంతో నోటిఫికేషన్ కు అన్ని సన్నాహాలు చేశారు. ఇంతలో ఎందుకో వాయిదా వేశారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వాయిదా వేశారని ప్రచారం జరిగింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో లోకేష్ ప్రత్యేక ప్రకటన చేశారు.

* వచ్చే విద్యా సంవత్సరం నాటికి
వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా డీఎస్సీ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ ఒక్క డీఎస్సీని కూడా పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల స్టంట్ గా డీఎస్సీ ప్రకటన చేశారని.. కేవలం 6100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదేళ్లపాటు డీఎస్సీ అభ్యర్థులను దగా చేశారని ఆరోపించారు.

* వయోపరిమితి పై నిర్ణయం
మరోవైపు డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా డీఎస్సీ ప్రక్రియ లేకపోవడంతో చాలామంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయింది. దీంతో వారంతా డీఎస్సీ పరీక్షకు సిద్ధమైనా.. నోటిఫికేషన్ రాకపోవడంతో వారి ప్రయత్నం నిరుపయోగంగా మారింది. ఈ డీఎస్సీలో వయోపరిమితి పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులపై డీజీపీతో చర్చిస్తున్నామని.. వాటి ఎత్తివేత విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు.