Kashi Bugga Stampede Incident: తెలుగు రాష్ట్రాల్లో భక్తి వరదలాగా ప్రవహిస్తోంది. ఏదైనా గుడి గొప్పగా ఉందని సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు జనం వెల్లువలాగా వెళ్ళిపోతున్నారు. తమ కోరికల చిట్టాను భగవంతుడు ముందు విప్పుతున్నారు. భగవంతుడు కరుణిస్తాడా? లేదా? అనే విషయాలను పక్కనపెట్టి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటున్నారు. పొర్లు దండాల నుంచి మొదలుపెడితే విలువైన కానుకల వరకు దేవతామూర్తుల సమర్పించి అనుగ్రహం పొందుతున్నారు.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
భక్తి ప్రవాహం తెలుగు ప్రజల్లో అధికంగా ఉండడంతో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు కన్నుమూశారు. దీనిని మర్చిపోకముందే శనివారం శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని పదిమంది భక్తులు దుర్మరణం చెందారు.. ఈ రెండు ఘటనలే కాకుండా.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి.. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూ లైన్ లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. జనవరి 29న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కుంభమేళ మౌని అమావాస్య సందర్భంగా భక్తులు స్నానాలు చేయడానికి పోటీపడ్డారు. జనం విపరీతంగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ లోని రైల్వే అనౌన్స్మెంట్ లో గందరగోళం చోటుచేసుకుంది. ప్లాట్ఫారం 14, 15 పై 18 మంది దుర్మరణం చెందారు.. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. సెప్టెంబర్ 27న తమిళనాడు రాష్ట్రంలోని కరూరు ప్రాంతంలో టీవీ కే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో 41 మంది దుర్మరణం చెందారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటచోటి చేసుకొని పదిమంది చనిపోయారు.
ఉద్రిక్తత వల్లే..
ఈ తరహా సంఘటనలు ఇటీవలి కాలంలో అధికంగా చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం పరిమితికి మించి భక్తులు రావడమే. భక్తులు సామర్థ్యానికి మించి రావడంతో ఉద్రిక్తత లు చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటున్నది.. ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ జనాలలో మార్పు రాకపోవడం.. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.
స్వీయ రక్షణ ముఖ్యం
దర్శనీయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భక్తులు సమమనం పాటించాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంత వాతావరణంలో దేవతామూర్తులను దర్శించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊహాగానాలను నమ్మకూడదు. పుకార్లను వ్యాపింప చేయకూడదు. అప్పుడే దర్శనీయ ప్రాంతాల సందర్శన సులువు అవుతుంది.