Bigg Boss Telugu Day 9 Day 55 Promo: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో టాస్కులు ఆడడం లో కానీ, కంటెస్టెంట్స్ తో ప్రవర్తించే తీరు విషయం లో కానీ, చాలా కూల్ కంటెస్టెంట్ అని అనిపించే వారిలో ఒకరు డిమోన్ పవన్. కచ్చితంగా టాప్ 5 లో ఉండేందుకు అన్ని విధాలుగా అర్హత ఉన్న కంటెస్టెంట్ అతను. కటిక పేదరికం నుండి ఇండస్ట్రీ లో అవకాశాలు కోసం అగ్నిపరీక్ష షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు డిమోన్ పవన్. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి నుండి నేటి వరకు ఒక్క బ్యాడ్ రిమార్క్ లేకుండా ముందుకు దూసుకుపోతున్న పవన్ కి నేడు హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. గత వారం మొత్తం ఆయన రీతూ చౌదరి తో గొడవలు పడుతూ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కెప్టెన్ రూమ్ లో వీళ్లిద్దరి మధ్య వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
‘నేను లైఫ్ లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను’ అని రీతూ చౌదరి అన్న మాటలకు కోపం తెచ్చుకున్న డిమోన్, ఆమెని తోసేస్తాడు. ఒకసారి కాదు, రెండు మూడు సార్లు అలాగే తోస్తాడు. ఇది చూసే ఆడియన్స్ కి అమ్మాయితో అసభ్యంగా వ్యవహరించాడు అనిపించింది. కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఇందులో నాగార్జున డిమోన్ రీతూ తో ప్రవర్తించిన తీరు గురించి వీడియో చూపిస్తూ, పవన్ ఇలాంటి పనులు చేస్తే మీ ఇంట్లో ఇలాగే సైలెంట్ గా ఉంటారా?, లేదా బెల్ట్ తీసుకొని కొడతారా?, అని అడగ్గా, దానికి ఆడియన్స్ అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని అంటారు. అప్పుడు డిమోన్ పవన్ క్షమాపణలు చెప్తాడు. ఇది క్షమించరాని నేరం, నీకు రెడ్ ఫ్లాగ్ ఇస్తున్నాను, నీకోసం గేట్స్ తెరుచుకున్నాయి, బట్టలు సర్దుకో,బయటకు వచ్చేయ్ అని అంటాడు నాగార్జున.
అప్పుడు రీతూ చౌదరి కలగచేసుకొని ప్లీజ్ సార్ అని అడుగుతుంది. అయినప్పటికీ నాగార్జున మాట వినడు, బయటకు రా అని సీరియస్ గా అరుస్తాడు. పాపం డిమోన్ పవన్ చాలా సేపటి వరకు ఏడుస్తూ బ్రతిమిలాడుతాడు, నేను అలాంటి వాడిని కాదు సార్, క్షమించండి సార్ అని చాలా వరకు రిక్వెస్ట్ చేస్తాడు. అప్పటికీ నాగార్జున పట్టించుకోడు, ఇక హౌస్ మేట్స్ అందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని బ్రతిమిలాడడం, ఆ తర్వాత ఆడియన్స్ కూడా ఈ ఒక్కసారికి క్షమించమని కోరడంతో, నాగార్జున ఈ ఒక్కసారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి క్షమిస్తాడు. ఇది డిమోన్ పవన్ కి చాలా పెద్ద పాజిటివ్ ఎపిసోడ్ అనొచ్చు. ఎందుకంటే ఆడియన్స్ లో ఆయన ఓటింగ్ గ్రాఫ్ ఎవ్వరి ఊహలకు అందకుండా వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. టాప్ 5 లోకి చాలా తేలికగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఈ ఎపిసోడ్ తో అవ్వొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.