Kashi Bugga Tragedy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పదిమంది దాకా దుర్మరణం చెందారు. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. ఇక ఈ ప్రమాదం నేపథ్యంలో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడో మారుమూల కాశీబుగ్గ ప్రాంతంలో ఈ తరహా సంఘటన జరగడానికి కారణం ఏంటి? పూర్తిగా ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఈ ఆలయానికి ఈ స్థాయిలో జనం ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
కార్తీకమాసం కావడంతో..
కార్తీక మాసం కావడంతో వెంకటేశ్వర స్వామి గుడికి భక్తులు భారీగా వచ్చారు. వాస్తవానికి ఈ ఆలయం 2023 లో నిర్మాణం పూర్తయింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన 90 సంవత్సరాల హరి ముకుంద పండ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయనకు 50 ఎకరాల భూమి ఉంది. పది ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. హరి ముకుంద్ రాజ వంశానికి చెందినవాడు. ఈయన ఒకసారి తిరుమల తిరుపతి వెళ్లారు.. స్వామివారిని దర్శనం చేసుకునే క్రమంలో ఈయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అతనే పది కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించాడు. 2023లో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ ప్లూయన్సర్స్ ఈ గుడి గురించి రకరకాల వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఈ గుడి గురించి చాలామంది తెలుసుకొని.. ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వచ్చారు. పైగా కార్తీక మాసం కావడంతో భక్తులు అధికంగా వచ్చారు. ఇదే సమయంలో ఆలయంలో నిర్మించిన రెయిలింగ్ కూలిపోయింది. దీంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట చోటు చేసుకుంది..ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.
సేవా తత్పరుడు
కాశీ బుగ్గ ఆలయ ధర్మ కర్త పేరు హరి ముకుంద్ పండ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ప్రతి సోమవారం అంధులు, దివ్యాంగులకు అన్నదానం చేస్తారు. ఒక్కొక్కరికి ₹300 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. కొందరికి అయితే చేయడానికి ఒకసారి ఐదు నుంచి పదివేల వరకు చెక్కులు ఇస్తారు. హరి ముకుంద తల్లికి దాదాపు 50 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో కొబ్బరి, మామిడి, జీడి మామిడి తోటలు ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్టు హరి ముకుంద పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేదన్నారు.